కులికుతుబ్ షాహి టూంబ్స్ మెుదటి దశ పునరుద్దరణ పనులు వచ్చే జనవరి కల్లా పూర్తి…తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం.

కులికుతుబ్ షాహి టూంబ్స్ మెుదటి దశ పునరుద్దరణ పనులు వచ్చే జనవరి కల్లా పూర్తి...తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం.

 

తెలంగాణ టూరిజం , సాంస్కృతిక , పురావస్తూ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారితో అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ గ్లోబల్ హెడ్ మోంరీల్ , మ్యూజియమ్స్ గ్లోబుల్ డైరెక్టర్  ఎమన్ మహిర్ లు సచివాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో కులికుతుబ్ షాహి టూంబ్స్ అధునికీకరణ పనులపై చర్చించారు. సమావేశం వివరాలను తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం మీడియా కు వివరించారు. ఆగాఖాన్ ట్రస్ట్ అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక , వారసత్వ కట్టడాలను పరిరక్షించే సంస్థ గా గుర్తింపు పోందిందన్నారు. ఇప్పటికే డిల్లీ లోని హూమాయిన్ టూంబ్స్ పునరుద్దరణ ను పూర్తి చేసిందన్నారు. అదే స్థాయిలో హైదరాబాద్ లోని కులికుతుబ్ షాహి టూంబ్స్ ను పునరుద్దించే బృహత్ కార్యక్రమాన్ని అగాఖాన్ ట్రస్ట్ సుమారు 100 కోట్ల సొంత నిధులను ఖర్చు చేసిందన్నారు, అలాగే టూరిజం, సాంస్కృతిక , పురావస్తూ శాఖ ద్వారా మరో 100 కోట్ల నిధులతో పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.. టూంబ్స్ గత 500 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అదే విధంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించాలనే లక్ష్యంతో అగాఖాన్ ట్రస్ట్ , తెలంగాణ టూరిజం లు కృషి చేస్తున్నట్లు కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.

హైదరాబాద్ లోని కులికుతుబ్ షాహి టూంబ్స్ కు ప్రపంచంలో రాజవంశానికి లేని ప్రత్యేకత ఉందన్నారు. ఒక  రాజవంశానికి చెందిన వారందరి సమాదులు ఒకేచోట ఉండటం వల్ల కుతుబ్ షాహి టూంబ్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. వీటితో పాటు టూంబ్స్ లో ప్రణాళిక బద్దంగా తీర్చిదిద్ధిన గార్డేన్ లు , ఫౌంటేన్ లు మెుగలుల రాజవంశీకుల  పరిపాలన  కంటే ముందే మంచి ఉద్యానవనాలను తీర్చిదిద్దిన ఘనత హైదరాబాద్ ను పరిపాలించిన కులికుతుబ్ షాహి లకు దక్కిందన్నారు. అంతటి వారసత్వ చరిత్ర ను పరిరక్షించటానికి అగాఖాన్ ట్రస్టు కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ కార్యక్రమాలను అందిస్తామన్నారు టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం. కులికుతుబ్ షాహి టూంబ్స్ మెుదటి దశ పునరుద్దరణ పనులు వచ్చే జనవరి కల్లా పూర్తి అవుతాయన్నారు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *