కులాంతర వివాహలు చేసుకున్న జంటలకు 2.8 లక్షల మంజూరు: నీతూ ప్రసాద్

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కులాంతర వివాహలు చేసుకున్న 29 జంటలకు ప్రభుత్వం 2 లక్షల 80 వేల రూపాయలు ప్రోత్పాహక అవార్డుల క్రింద నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవారం కలెక్టరేటు ఆడిటోరియంలో కులాంతర వివాహలు చేసుకున్న జంటలకు 10వేల చొప్పున ప్రాత్సాహక బహుమతి చెక్కులను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011 జూన్ వరకు కులాంతర వివాహం చేసుకున్న 29 జంటలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా ప్రభుత్వం త్వరలో ప్రోత్సాహక అవార్డు నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ డా. నాగేంద్ర, బిసి సంక్షేమ శాఖ డిడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *