
యువ భారత్ అదరగొట్టింది. సీనియర్ క్రికెటర్ల కంటే కూడా మెరుగ్గా ఆడి దక్షిణాఫ్రికా పని పట్టారు. దక్షిణాప్రికా క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్ తో టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్ ఆడేందుకు దేశంలో పర్యటిస్తోంది.. ఇందులో భాగంగా నిన్న భారత్ ఏ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడింది.. భారత్ ఏ కుర్రాళ్ల ధాటికి చిత్తుగా ఓడిపోయింది.. భారీ అంచనాలతో వచ్చిన పటిష్ట సౌతాఫ్రికాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది..
నిన్న టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగుల భారీ స్కోరు సాధించింది.. డుమిని 68, డివిల్లియర్స్ 37, డుప్లెసిస్ 42 పరుగులు చేశారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ లక్ష్యాన్ని దూకుడుగా చేధించింది.. మాయాంక్ 87,వోహ్రా 56, సంజు శాంసన్ 31 పరుగులతో దుమ్ము దులిపి విజయాన్నందించారు.