Breaking News

కుతుబ్ షాహి టూంబ్స్ అభివృద్ధి పై అగాఖాన్ ట్రస్ట్ తో ఒప్పందం

కుతుబ్ షాహి టూంబ్స్ అభివృద్ధి పై అగాఖాన్ ట్రస్ట్ తో ఒప్పందం

కుతుబ్ షాహి టూంబ్స్ అభివృద్ధి పై అగాఖాన్ ట్రస్ట్ తో ఒప్పందం..

తెలంగాణ టూరిజం , పురావస్తు శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం.

కుతుబ్ షాహి టూంబ్స్ అభివృద్ది పై అగాఖాన్ ట్రస్ట్ తో  తెలంగాణ పురావస్తు శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అవగాహన ఒప్పందం ద్వారా అగాఖాన్ ట్రస్ట్ సొంత నిధులతో  కుతుబ్ షాహి టూంబ్స్ ను పరిరక్షించటం తో పాటు 100 కోట్లతో  పునర్ నిర్మాణం జరపి అభివృద్ది చేయనున్నట్లు పర్యాటక, పురావస్తు శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం సచివాలయంలో  వెల్లడించారు. ప్రపంచంలో పురాతన కట్టడాల పరిరక్షించటంలో అగాఖాన్ ట్రస్ట్ కు మంచి పేరుందన్నారు. డిల్లీ నగరంలో ఉన్న ఉమాయిన్ టూంబ్స్ ను అగాఖాన్ ట్రస్ట్ అభివృద్ది చేసిందన్నారు. అదే మాదిరిగా హైదరాబాద్ లో ఉన్న కుతుబ్ షాహి టూంబ్స్ ను  అభివృద్ది చేయటానికి అగాఖాన్ ట్రస్ట్ సొంత నిధులు 100 కోట్లు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 98 కోట్ల తో కలిపి టూంబ్స్ కు గతంలో ఎలా ఉందో అదే విధంగా పునర్ నిర్మాణ పనులు చేపట్టి అభివృద్ది చేయటానికి  ఒప్పంద పత్రాలు మార్చుకున్నామన్నారు . వచ్చే పదేళ్లలో కుతుబ్ షాహి టూంబ్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయి మంచి ఉద్యానవనాలతో  పర్యాటకులకు  అందుబాటులోకి తీసుకవస్తామన్నారు తెలంగాణ టూరిజం , పురావస్తు శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం. సచివాలయంలో జరిగిన  ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు డా. విశాలాక్షి, అగాఖాన్ ట్రస్ట్ ఇంటర్ నేషనల్ ప్రతినిధులు లూయిస్ మండ్రియల్, అశిష్ మర్చేంట్, రితిష్ నందా లు పాల్గోన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *