కుటుంబం బట్టలూడదీసి కొట్టిన పోలీసులు

ఉత్తరప్రదేశ్ లో ఓ ఘోరం వెలుగుచూసింది.. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళిత కుటుంబాన్ని పోలీసులు దారుణంగా హింసించారు. యూపీలోని లక్నోకు సమీపాన గల దన్ కోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన అతడు అతడి భార్య,, మరికొందరు బంధువులతో పోలీసులు బట్టలూడదీసి వికృత చేష్టలు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. వారి పట్ల దళితులని నిర్లక్ష్యంగా క్రూరంగా ప్రవర్తించారు.

ఫిర్యాదు తీసుకోండని నిలదీయడమే వారిపాలిట శాపం అయ్యింది.. పోలీసులకు తమనే బెదిరిస్తావా అని కుటుంబాన్ని మొత్తంపై దాడి చేశారు. కొట్టుకుంటూ రోడ్డుపైకి తీసుకొచ్చి చంటిబిడ్డతో ఉన్న సునీల్ భార్య చీర లాగి పడేశారు. అడ్డుపడిన సునీల్ బట్టలను కూడా చించేశారు. చంటిబిడ్డను అడ్డపెట్టుకొని ఆ మహిళ సిగ్గుతో పోరాడడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది..

అక్కడి స్థానికుడు ఈ వీడియో నెట్ లో పెట్టడంతో పోలీసుల దుశ్చర్య వెలుగుచూసింది.. రాజకీయ నాయకులు ప్రజలు యూపీ సర్కారు పై ధ్వజమెత్తుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *