
తెలంగాణలో ప్రతిపక్షాల తొలి ఫైట్ అట్టర్ ప్లాప్ అయ్యింది.. ఇన్నాళ్లు కొత్త ప్రభుత్వం, కొత్త నాయకత్వం అంటూ తెలంగాణ లో అధికార టీఆర్ఎస్ ను ప్రతిపక్షాలు కాపాడుతూ వచ్చాయి. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రతిపక్షాల వేడి తగల్లేదు..
ఎంమైందో ఏమో కానీ ఈ శాసనసభా సమావేశాల్లో ప్రతిపక్షాల్లో ఐక్యత వచ్చింది.. అన్నీ కలిసి కట్టుగా మారి టీఆర్ఎస్ ను అష్ట దిగ్బంధం చేశాయి. రైతు రుణమాఫీని వేల కోట్లను ఒకేసారి మాఫీ చేయాలని అసెంబ్లీలో భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో టీఆర్ఎస్ కు దిక్కుతోచలేదు..
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. శాసనసభా సమావేశాల్లో టీఆర్ఎస్ ను ఇరుకునపెడదామనుకున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు అదిరిపోయే షాక్ ఇచ్చింది అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఆందోళన చేసినందుకు ఈ శాసనసభా సమావేశాల మొత్తం ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో ప్రతిపక్షాల కాటు టీఆర్ఎస్ దెబ్బ అదిరిపోయింది.
వచ్చే సమావేశాల్లోనైన ప్రతిపక్షాల వ్యూహం ఫలిస్తుందో, టీఆర్ఎస్ కు ముకుతాడు పడుతుందో లేదో చూడాలి.