
-మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు..
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలో జరిగిన ఓ గొడవ.. పాతకక్షలతో రగిలిపోతున్న రెండు వర్గాల మధ్య చిచ్చును రగిల్చింది.. ఒక్క వర్గం కుక్క మరో వర్గం వారిని కలవడం వివాదానికి కారణమైంది.. కుక్క కరిచిందని నిలదీస్తే.. ఏం చేస్తారో చేసుకోమ్మన్న ఒక వర్గం వారిని దారుణంగా హతమర్చారు మరో వర్గం వారు…
బెల్లంపల్లిలో పక్కపక్కనే ఉంటున్న రెండు కుటుంబాలకు పాత కక్షలు ఉన్నాయి. ఒకటి ఇంట్లోని కుక్క పక్కింటి వారిని కరవడంతో లొల్లి మొదలైంది.. చికిత్స చేయించుకొని వచ్చిన సదురు వర్గం వారు కత్తులు, గొడ్డళ్లతో మరో వర్గం వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.