కుంభమేళ కన్న మిన్నగా 600కోట్లతో గోదావరి పుష్కరాలు

కుంభమేళ కన్న మిన్నగా 600కోట్లతో గోదావరి పుష్కరాలు

కాళేశ్వరం: గోదావరి పుష్కరాలను కుంభమేళ కన్న మిన్నగా 600కోట్లతో నిర్వహిస్తున్నామని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం ఉదయం 6.25 ని.లకు కాళేశ్వరంలోని గోదావరిలో మంత్రి పుష్కరస్నానం చేసి గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర్రం కొత్తగా ఏర్పడిన తర్వాత తొలి గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించు కుంటున్నామని అన్నారు. ప్రభుత్వము 600కోట్లు ఖర్చు చేసి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లను నాలుగు నెలల నుండి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసామని తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు కరుణించి రాష్ట్ర్రంలో వర్సాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో ప్రజలు సుఖ: శాంతులతో ఉండాలని
కోరారు. తెలంగాణ రాష్ట్ర్రం మరింత అభివృద్ధి చెంది గొప్పగా ఎదగాలని ఆకాక్షించారు. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాల సంద్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. కొత్త రాష్ట్ర్రం లో తొలిసారి వచ్చిన గోదావరి పుష్కరాలను రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారని తెలిపారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలతో తులతూగాలని అన్నారు. 12సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానమాచరించి పుణీతులు కావాలని కోరారు. అనంతరం మంత్రులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. మంత్రులు బ్రహ్మకళశంలో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామి వార్లకు అభిషేకం చేశారు. మంత్రులకు స్వామి వారి చిత్ర పటాలను బహుకరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన సభ్యులు పుట్ట మధు, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, స్పెషల్ ఆఫీసర్ సూరజ్ కుమార్, ఆలయ ఛైర్మన్ అవదాని మోహన శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *