కుంటిసాకులు వద్దు.. నాణ్యత పాటించకుంటే చర్యలు :పట్నం మహేందర్ రెడ్డి

 

 కోట్లాధి నిధులతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాని కుంటిసాకులు వద్దని రవాణాశాఖ  మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆర్ అండ్ బీ శాఖల మీద సమిక్షించారు. జిల్లా కలెక్టర్ లు రఘనందర్ రావు, ఎంవీ రెడ్డి, దివ్యలతో పాటు ఆయా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమిక్షలో మూడు జిల్లాలలో చేపట్టిన పనుల మీద నియోజకవర్గాల వారిగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద డిసెంబర్ నాటికి గ్రామాలకు నీరు చేరాలని, జూన్ నాటికి ఇంటింటికి మంచినీరు అందాలని ఆదేశించారు. 2004 కోట్లతో చేపట్టిన పథకం 1381 ఆవాసాలకు నాలుగు నగర పాలక సంస్థలలోని 13 లక్షల మందికి మంచినీరు ఇచ్చి తీరాలని అన్నారు.

మిషన్ భగీరధ కింద రంగారెడ్డి, వికారాబాద్  జిల్లాలో మేయిన్ గ్రిడ్ 1800 కోట్లతో చేపట్టగా 3 డబ్ల్యూ టీపీల పరిధిలో 3500 కిమి పైప్ లైన్ లు సెప్టెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలన్నారు.

ఇందులో భాగంగా జూన్ 2017 నాటికి పూర్తి చేయాలని అన్నారు. ముచ్చర్ల లోని డబ్ల్యూ టీపీ 72% పూర్తివగా, షాబాద్ మండలం అంతారంలో ని డబ్ల్యూ టీపీ 48% మాత్రమే పూర్తైందని, పరిగిలోని రాఘవాపూర్ లోని డబ్ల్యూ టీపీ 60% శాతం పూర్తవటం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అందుకు కలెక్టర్ రఘనందన్ రావు, దివ్యలు తమ సహాకారం ఉంటుందని సమస్యలు తెలపాలని ఎస్సీలకు సూచించారు. ఇలా మేమిన్ పైప్ లైన్లు గ్రామాల వరకు సెప్టెంబర్ 2017 నాటికి పూర్తి చేస్తే శ్రీశైలం నుండి మంచినీటిని డిసెంబర్ 2017 కు తేవాలని మంత్రి ఆదేశించారు. మేడ్చెల్ లోని కొత్తగా  14.66 కోట్లతో  చేపట్టిన  మూడు కీసర, ఘట్ కీసర్, కొండాపూర్ లకు ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలని అన్నారు. 104 గ్రామాలకు మంచినీరందించే పనుల్లో 86 గ్రామాలకు పూర్తి చేశామని అధికారులు వివరించారు. మిగతా ప్రాంతాలలో పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అయితే పనులలో గోతులు తవ్వి వదలటం, అర్థాంతరంగా నిలపివేయటం సహించమని కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. అలాగే గ్రామాలలో ఇంటింటికి నీరందించే పనులలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 1056 ఆవాలసాలలో చేపట్టిన 853 ఓహోచ్ఎస్ ఆర్ ట్యాంకులను 408 కోట్ల 54 లక్షలతో సాగుతున్న పనులు 2, 19,211 నల్లాలు 10 లక్షల మందికి నీరందించే 2093.54 కిమి పైప్లైన్ లు, ఓహెచ్ఎస్ ఆర్ లను 463 ప్యాకేజీలుగా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు.156 గ్రామాలకు జూన్ 2017, 407 గ్రామాలకు సెప్టెంబర్ 2017, అలాగే 493 గ్రామాలకు డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేసి తీరాలని అధికారులకు మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు.

వికారాబాద్ జిల్లాలో 883 ఓహెచ్ఎస్ ఆర్ లను 308 కోట్లతో చేపట్టామని 971 గ్రామాలకు చెందిన 8,27,303 మందికి మంచినీటి సరఫరా లో ఇప్పటి వరకు 271 ఓహెచ్ ఎస్ ఆర్లుపూర్తి చేశామని అన్నారు. కోడంగల్, పరిగిలో భగీరథ పనులు అధ్వానంగా సాగటం మీద మంత్రి మండిపడ్డారు. ఇబ్బందులు చెప్పాలని సూచించారు.

         మిషన్ కాకతీయ పనుల మీద మంత్రి జిల్లాల వారిగా ఎస్సీలతో ఆరా తీశారు. మూడు జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో మూడు దఫాలుగా 923 చెరువులకు  సుమారు 70 కోట్ల నిధులతో  పూటిక చేపట్టగా వీటిలో తొలిదశలో అక్కమ్మ చెరువు, రెండో దఫాలో 146 చెరువులు పూర్తచేశామని వివరించారు. అయితే మిగతా చెరువు పునరుద్ధరణ ఎందుకు పూర్తి చేయరని మంత్రి అధికారులను నిలదీశారు. 100 చెరువులకు టెండర్లు పిలిస్తే 35 పూర్తి చేశామని అన్నారు.171 చెరువులకు 20 కోట్లు వచ్చాయన్నారు.

 వికారాబాద్ జిల్లాలో 651 చెరువులకు 168 కోట్లు మంజూరవగా వీటిలో తొలి దఫాలో 239 పూర్తి చేయగా, రెండో దఫాలో 68 పూర్తి చేశామని అధికారులు వివరించగా మిగతా పనులను వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు.

మేడ్చెల్ జిల్లాలో 173 చెరువులను 60 కోట్ల తో చేపట్టగా వీటిలో తొలిదశలో అన్ని పూర్వవగా రెండో దఫాలో 56 చెరువులు పూర్త చేశామని అధికారులు చెప్పారు. అయితే మిషన్ కాకతీయ పనులు ఎట్టి పరిస్థితులలో నాణ్యతగా ఉండేలా చూడాలని అందుకు కలెక్టర్లు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

ఆర్అండ్ బీ పనులలో భాగంగా వికారాబాద్ జిల్లా 89 పనులకు 653 .39 కోట్ల నిధులు మంజూరవగా వీటి ద్వారా 554 కిమి రోడ్డు చేసే ప్రక్రియ సాగుతందని వీటిలో 35 పనులు పూర్తవగా 36 పనులు నడుస్తున్నాయని అధికారులు వివరించారు. 13 పనులకు టెండర్లు పిలిచారని మరో 5 పనులకు 77.35 కోట్లకు ప్రతిపాధనులు పంపామని అన్నారు.

అయితే తాండూర్ లో 78 కోట్ల తో 12.79 కిమి బైపాస్ రోడ్డు, కాగ్నామీద 16,80 లక్షలతో నిర్మిస్తున్న బ్రిడ్జీ, పాత తాండూర్ లోని 51.75 కోట్లతో రైల్వే బ్రిడ్జీ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండటం మీద మంత్రి మండిపడ్డారు. తాండూర్ బ్రిడ్జీ నిర్మాణాల ఇబ్బందులను మంత్రి తెలుఉకుని ఎట్టి పరిస్థితులో 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రైల్వే శాఖ ఇబ్బందులు తాను మందుండి తీరుస్తానని కలెక్టర్ దివ్య తెలిపారు. వికారాబాద్ –తాండూర్ రోడ్డులోని మూడు బ్రిడ్జీలు, తాండూర్ –చించోలీ లోని రోడ్డు నిర్మాణాలు, తాండూర్ – ధారూర్ లోని రోడ్డు బ్రిడ్జీల నిర్మాణాలకు నిధులు అందుతాయని వెంటనే టెండర్లు పూర్తి చేయించాని మంత్రి ఆదేశించారు.ఆలాగే బషీరాబాద్ మండలం లోని జీవన్గీ కాగ్నా నద గతంలో 10 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జీని 13.40 లక్షలకు పెంగా నిర్మాణాలకు నెల లో టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు.  వికారాబాద్ లోని ప్రధాన రహాదారి, పరిగి లోని పలు రోడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగటం పట్ల మంత్రి మండి పడ్డారు.

         రంగారెడ్డి జిల్లాలో 41  పనులకు   255 కోట్లతో 323 కిమి పనులు చేపట్టగా వీటిలో32 పనులు పూర్తి చేశామని అన్నారు.

            మేడ్చెల్ జిల్లాలో 14 పనులకు 89 కోట్లు విడుదల కాగా 68 కిమి రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయని వివరించారు. వీటిలో 7 పనులు పూర్తి చేయగా మిగతాయి ముందుకు సాగుతున్నాయని అన్నారు. అయితే రోడ్లకు మట్టి, మెటీరియల్, భవనాలకు ఇసుక ఇబ్బందులు రాకుండా చర్చలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఎస్సీలు నరేందర్ గౌడ్, భాను ప్రసాద్, రమేష్ బాబు, ఇఇలు , డీయిలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *