Breaking News

కీబోర్డు వాదనలో రాణిస్తున్న చిన్నోడు..

key-board

సాధనముచేయురా నరుడా సాధ్యంకానిది లేదురా! అన్నట్లు నేడు చిన్నారులు చదువుతోపాటు కళల్లో కూడా రాణిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. పలు వేదికలపై కళాంశాలను ప్రదర్శిస్తు తమసత్తా చాటుతున్నారు. ఆకోవకు చెందినవాడే మన చిలకమర్రి శ్రీనివాసాచార్యులు గాయత్రిల సంతానమైన శ్రీవర్ధన్. లారెల్ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్నాడు. ఇటు బాలభవన్ లో కె.బి.శర్మ వద్ద కీబోర్డులో శిక్షణ పొందుతున్నాడు. అత్యద్భుత సాధనతో అనతికాలంలోనే మెలకువలు నేర్చి పలు వేదికలపై ప్రదర్శిస్తున్నాడు. అన్నమయ్య కీర్తనలు, సినీగీతాలు పలు భక్తి గీతాలను లయబద్ధంగా వాయించడంలో మరియు పాటకు సంబందించిన ఇంటర్ ల్యూడ్స్ వాయించడంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటున్నాడు ఈ చిన్నోడు. యల.వి.సుబ్రమణ్యం IASసమక్షంలో అన్నమయ్య కీర్తనలకు వాయిద్య సహకారం అందించి శభాష్ అనిపించుకున్నాడు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరి కోదండరామాలయంలో కీబోర్డ్ వాయిద్య సమకారం అందించి నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రతి ఏటా శ్రీ రాజరాజేశ్వర దేవస్ధానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే త్యాగరాజస్వామి ఉత్సవాలలో అన్నమయ్య కీర్తనలకు వాయిద్య సహకారం అందించి ఆలయ కార్యనిర్వాహణాధికారి దూస రాజేశ్వర్, ఆస్ధాన విద్వాంసులు రామయ్య శర్మ గారి ఆశీస్సులందుకున్నాడు. మునుముందు మరింత రాణించి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని ఆశిద్ధాం… ఆశీర్వదిద్ధాం….

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *