‘కీచక’ రెడీ ఫర్ రిలీజ్

కీచక చిత్రానికి సెన్సార్ ప్రశంస

 రివెంజ్ త్రిల్లర్ గా వినూత్నమైన స్క్రీన్ ప్లే తో  తెరకెక్కుతున్న కీచక చిత్రం నిర్మాణానంతర కార్య క్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిధ్ధమయింది. సెన్సార్ లో “ఏ” సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి సెన్సార్ మెంబర్ల అభినందనలు లభించాయని నిర్మాత పర్వతరెడ్డి కిషోర్ కుమార్ తెలిపారు. చిత్రం హార్ష్ గా వయోలెంట్ గా ఉన్నప్పటికీ చాలా పర్పస్ ఫుల్ గా ఉందని వారు అన్నారని ఆయన చెప్పారు. మహిళలను ఇన్ స్పైర్ చేసే ఒక  అద్భుతమైన సంఘటన ఆధారం గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో బాటు ఆస్కార్ లైబ్రరీ కి ఎంపికైన మిణుగురులు చిత్ర కథారచయిత ఎన్. వీ. బీ చౌదరి దర్శకత్వం లో తయారైన ఈ చిత్రం ఆడియో కార్యక్రమం త్వరలో జరగనుందని నిర్మాత తెలిపారు.

01

శ్రీ గౌతమీ టాకీస్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం లో యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్, రోజా భారతి, మాధవి, మమతా రాహుత్ తదితరులు నటించగా డాక్టర్ జోస్యభట్ల అద్భుతమైన నాలుగు పాటలు అందించారని, రామ్ ప్రసాద్ యాదవ్ పదునైన సంభాషణలను రాయగా, కమలాకర్ కెమేరా బాధ్యతలు నిర్వహించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్. వీ.బీ. చౌదరి అని నిర్మాత కిషోర్ పర్వత రెడ్డి తెలియజేశారు. 

02keechaka

Banner ; Sri Gouthami Talkies
Name of the film ; Keechaka
Main cast ;  Yamini Bhasker, Jwala Koti, Raghu Babu, Nayudu, Vinod, Roja Bharathi, Madhavi, Mamata Rahuth and others
Camera ; Kamalakar
Producer ; Kishore Parvatha Reddy
Director ; SVB Chowdary
05

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *