కివీస్ కు చెమటలు పట్టించిన స్కాట్లాండ్

-బోటాబోటీగా గెలిచిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ : ప్రపంచ కప్ ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ కు పసికూన స్కాట్లాండ్ చెమటలు పట్టించింది. న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ అతి కష్టం మీద సాట్లాండ్ పై 3 వికెట్లతో చావుతప్పి కన్నులొట్టబోయినట్లుగా గెలుపొందింది.

టాస్ ఓడిపోయిన స్కాట్లాండ్ తక్కువ పరుగులు 143కే ఆలౌట్ అయ్యింది. ఈ తక్కువ లక్ష్యాన్ని చేరుకోవడానికి బరిలోకి దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి తంటాలు పడింది. స్కాట్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ 24.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి భారంగా లక్ష్యాన్ని సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *