కిరణ్ 8వేల కోట్లు చిత్తూరు తరలిస్తే ఉత్తమ్ ఏం చేశావ్..

సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా చిత్తూరు జిల్లాకు దాదాపు 8వేల కోట్లు తరలించి అభివృద్ది పరుచుకున్నారని.. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడే కళ్లు మూసుకొని ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు కేసీఆర్.. ఇప్పుడు ఉత్తమ్ మిషన్ భగీరథపై విమర్శలు చేస్తున్నారని.. కానీ అప్పుడు కిరణ్ ను ఎదురించలేని ఈయన ఇప్పుడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

జగిత్యాల ఎమ్మెల్యే అమరవీరులు, బీడీ కార్మికులపై మాట్లాడారని.. కానీ అధికారంలోకి వచ్చాక మేం ఆదుకున్నాం.. కాంగ్రెస్ హయాంలో మీరు కనీసం మీ పక్కనే ఉన్న మెట్ పల్లి బీడీ కార్మికులను ఆదుకున్నారా అని జగిత్యాల ఎమ్మెల్యే ప్రశ్నించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *