కిరణ్ కుమార్ రెడ్డి కంటే ఎక్కువ పెట్టించా..

KCR177

సమైక్య రాష్ట్ర ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గడిచిన 2014 బడ్జెట్ లో 48000 కోట్ల బడ్జెట్ నే ప్రణాళిక మొత్తం గా కేటాయించారని.. కానీ నేడు తెలంగాణలో ఈ సంవత్సరం 60000 కోట్లను తెలంగాణ కోసం ప్రవేశ పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ వస్తే ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో నిరూపితం కావడానికి ఈ సంవత్సరం కేటాయించిన బడ్జెటే ఉదాహరణ అని కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ మెదక్ లోని దుబ్బాకలో తాను చదవుకున్న పాఠశాలలో కొత్త పాఠశాల భవనానికి 4 కోట్లతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను , సహవిద్యార్థులను కలుసుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ఉపాధ్యాయుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడడానికి ఈ నేల తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *