Breaking News

కిరణాలు చెప్పిన ‘నీళ్ల’ పంచాయతీ తీవ్రమైంది..

612

మాజీ సీఎం కిరణ్ పోతూ పోతూ నీటి గొడవలు తీవ్రమవుతాయని చెప్పకనే చెప్పారు. ఇప్పుడవే నీటి పంచాయతీ తెలంగాణ, ఆంద్రా రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.. దీనికి ఏపీ సీఎం, ప్రభుత్వం నిప్పు రాజేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నపాలమూరు-రంగారెడ్డి, నక్కలగిండి ప్రాజెక్టులు అక్రమం.. వాటిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి, జలసంఘానికి ఫిర్యాదు చేసింది.

దీనిపై తెలంగాణ భగ్గుమంది. చంద్రబాబు వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. టీ. ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. పాలమూరు, నక్కలగిండికి గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని అనుమతించారంటూ జీవోలు చూపించింది. కాగా కృష్ణ పరివాహకంలోని నల్గొండ, మహబూబ్ నగర్ లకు నీటి కేటాయింపులు కాదని.. రీజియన్ లో లేని అనంతపురం, కర్నూలకు ఎలా నీటి సరఫరా చేస్తారంటూ తెలంగాణ వాదిస్తోంది. ఇది తెలంగాణ గొంతు కోయడమే అంటూ మండిపడుతోంది.

కాగా ఏపీ ప్రభుత్వం గోదావరిపై చేపడుతున్న వట్టిసీమ అక్రమమంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, జలసంఘానికి ఫిర్యాదు చేశారు. వట్టిసీమతో గోదావరి మిగులు జలాలను తెలంగాణకు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *