
కిక్ 2 సినిమా విడుదలై కొంత డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.. కిక్ అంతే హిట్ కాలేదు ఈ సినిమా.. కిక్ 2 లో రెండో పార్ట్ లో బాగా స్లో సాగతీత ఎక్కువైందని సినిమాపై ప్రేక్షకుల్లో విసుగు కనిపించింది..
దీంతో సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి 2.30 గంటల నిడివి గల సినిమాలో 20 నిమిషాల సినిమాను కట్ చేయాలని నిర్ణయించారట.. రేపటి నుంచి సినిమా 20 నిమిషాల కత్తిరింపుతో వస్తుందని చెప్పారు.