కాళేశ్వరం ప్రాజెక్టు–II కు 11,400 కోట్ల రూపాయల బ్యాంకుల రుణం : ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్.పి. సింగ్.

కాళేశ్వరం ప్రాజెక్టు – II కు 11,400 కోట్ల రూపాయల రుణo

కాళేశ్వరం ప్రాజెక్టు – II కు రు. 11,400 కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి. సింగ్ తెలిపారు.  శుక్రవారం హైదరాబాదు లోని తాజ్ క్రిష్ణ హోటల్ లో నిర్వహించిన “కాళేశ్వరం ప్రాజెక్టు – II ఆర్థిక ముగింపు సమావేశం” లో ఆయన పాల్గొన్నారు.  

ఈ సమావేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్శిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో బ్యాంకులు భాగస్వామ్యం అవటం వలన తెలంగాణా ప్రభుత్వం నూతన ఒరవడిని తీసుకొని వచ్చినట్లయిందని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు.  నిధుల కొరత వలన చాలా ప్రాజెక్టులు నిదానంగా సాగుతున్నాయని అన్నారు.  బ్యాంకులు ప్రాజెక్టులలో భాగస్వామ్యం అవ్వడానికి ముందుకు రావడం వలన ప్రాజెక్టులు నిర్ణీత గడువులోపల పూర్తి చేయగలుగుతామని అన్నారు.  బ్యాంకుల ఒరవడి మారిందని, అభివృద్దిలో బ్యాంకులు పాలుపంచుకోవడం ఆనందదాయకమని అన్నారు.  రెండు నెలల స్వల్ప కాలంలో రు. 11,400  కోట్ల రూపాయల నిధులు సమకూర్చడం ఒక రికార్డని తెలిపారు. రు. 12,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాగా, ఈ సమావేశంలో ప్రాజెక్టు వ్యయంలో 33 శాతం రు. 11,400  కోట్ల రూపాయల రుణాన్ని కుదించినట్లు తెలిపారు. రెండవ దశ నిర్మాణానికి రు. 34,440.96 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు.  ప్యాకేజీ I & II కొరకు రు. 4,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, వీటిని కూడా బ్యాంకులు సమకూర్చాలని కోరారు.   

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి మాట్లాడుతూ, తక్కువ సమయంలో బ్యాంకులు నిధులను సమకూర్చడం వలన ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి అవుతాయని అన్నారు.  

ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, బి.సి. వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి శ్రీ అశోక్ కుమార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ శరణ్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *