కాళేశ్వరం ప్రాజెక్టు ప్రంపచ స్థాయి అద్భుతం: మంత్రి హరీష్ రావు

తెలంగాణ సాగు నీటి శాఖ దేశానికి దిక్సూచి..

ప్రాజెక్టుల రీ- డిజైనింగ్ లో….ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజనీర్.

కోటి ఎకరాల మాగాణి సీఎం కల…దాన్ని నెరవేర్చుదాం…. ఇంజనీర్లకు మంత్రి హరీష్ రావు ఉద్భోద.

నీటి యాజమాన్య పద్దతుల ద్వారా ఒక టీఎంసీ నీటితో 13 వేల ఎకరాల సాగు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రంపచ స్థాయి అద్భుతం.

నాలుగేళ్ల ప్రగతి – ప్రాజెక్టుల్లో సాగు నీటి నిర్వహణపై రాష్ట్ర స్థాయి సదస్సులో మంత్రి హరీష్ రావు కీలకోపన్యాసం.

తెలంగాణ సాగు నీటి శాఖ దేశానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ లో సోషల్ ఇంజనీర్ గా పని వ్యవహరిస్తే… క్షేత్ర స్థాయిలో సాగు నీటి శాఖ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సైనికుల్లా పని చేశారని ప్రసంశించారు. సాగు నీటి శాఖ పని తీరుపై మనకు మనమే చెప్పుకుంటే బాగుండదని, రైతుల పొలాలకు నీరు ఇచ్చినపుడే ఈ శాఖకు సార్థకతకు చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాగార్జున సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందుతుందని…మేం పంటలు వేసుకోగలుగుతున్నామని సూర్యపేటకు చెందిన వెంకటరెడ్డి అనే రైతు ఇదే వేదికపై చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. తమ శాఖ సాధించిన విజయం రైతు మాటాల్లోనే తెలిసిందన్నారు. నీటి యాజమాన్య పద్ధతులను సమర్థవంతంగా తమ ఇంజనీర్లు నిర్వహించడం వల్ల ఈ నాలుగేళ్లలో చివరి ఆయకట్టుకు నీరు ఇవ్వగలుగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, ఆయా శాఖల మధ్య సమన్వయం, క్షేత్ర స్థాయిలో ఇంజనీర్ల కృషి సాగునీటి శాఖలో చక్కటి ఫలితాలకు కారణమని మంత్రి హరీష్ రావు విశ్లేషించారు. ఒక టీఎంసీకి ఐదు వేల నుంచి ఆరువేల ఎకరాలు మాత్రమే సాగు చేసేవారు. కాని నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఈ ఏడాది ఒక టీఎంసీకి 11796 ఎకరాల సాగు జరిగింది. 4.4 టీఎంసీల ద్వారా 5.25 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చినట్లు చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, పోచంపాడ్ ద్వారా నీటి చివరి కాలువ వరకు నీరు ఇస్తున్నామన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీతో 13021 ఎకరాలకు నీరందించి కొత్త చరిత్ర సృష్టించినట్లు హర్షధ్వానాల మధ్య మంత్రి హరీష్ రావు ప్రకటించారు. పోచంపాడు ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీకి 9,650 ఎకరాల సాగు చేయడం విశేషమని చెప్పారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి, టేల్ టూ హెడ్ పద్ధతి ద్వారా చివరి భూములకు నీరందించగలిగినట్లు మంత్రి చెప్పారు. దీని వల్ల పంటల దిగుబడి పెరిగిందన్నారు. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల ధాన్యం పండించే రైతు… ఈ విధానం అమలు చేయడం వల్ల ఎకరానికి 50 నుంచి 55 బస్తాలకు దిగుబడి పెరిగినట్లు చెప్పారు. నీళ్ల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేయకుండా పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి గతంలో లేదన్నారు. కాని ఒక్క ధర్నా, రాస్తారోకో చేయకుండా రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ కే చెల్లిందన్నారు. గత అసెంబ్లీ చరిత్ర పరిశీలిస్తే… ప్రతిపక్షాలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవి. కాని బడ్దెట్ సమావేశాల్లో అలాంటి డిమాండ్ ప్రతిపక్షాల నుంచి లేకపోవడమే తమ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసిందన్నారు. రైతు గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, సాగు నీటి శాఖ ఇంజనీర్లు నిలిచిపోయారని కొనియాడారు. 25 ఏళ్లలో తొలి సారి గా…24 గంటల నాణ్యమైన విద్యుత్, చివరి ఆయకట్టు భూములకు నీరిచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిదేన్నారు. రాత్రింబవళ్లు పని చేస్తోన్న సాగు నీటి శాఖ ఇంజనీర్ల సమస్యలను సీఎం కేసీఆర్ తో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. మహిళా ఇంజనీర్లను మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. రాత్రి ఒంటి గంట సమయంలోను కాలువల వద్ద మహిళా ఇంజనీర్లు విధుల్లో ఉండటం గొప్ప విషయమన్నారు. నీటి నిర్వహణ సమయంలో మహిళా
ఇంజనీర్లు రాత్రి వేళల్లో పని చేస సందర్భంలో పోలీసు భధ్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సాగు నీటి శాఖలో అవసరమైన వాహనాలు, అధికారాలు కల్పిస్తామన్నారు. జిల్లా , డివిజన్ కమిటీలు వేసి నీటి యాజమాన్య పద్ధతులను మరింత పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో తెలంగాణలో ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయితే ఇక నీటి నిర్వహణ మాత్రమే ఉంటుందని మంత్రి ఇంజనీర్లకు చెప్పారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖలతో ముడిపడి ఉన్న శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు. మాకు 60 ఏళ్ల చరిత్ర ఉందని కొందరు చరిత్ర చెబుతారు. కాని సీఎం కేసీఆర్ చెప్పేది ఒక్కటేనన్నారు. ఎన్నేళ్లు పాలించామన్నది కాదు….. ప్రజలకు అవసరమైన పాలన ఎంత మేరకు అందించామన్నదే చరిత్రని సీఎం చెబుతుంటారన్నారు. మమ్మల్ని విమర్శించే వారి హయాంలో కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టుల పేర్లే పెండింగ్ ప్రాజెక్ట్స్ గా మారాయన్నారు. ఎన్నేళ్ల చరిత్ర ఉంద్నది ముఖ్యం కాదని, రైతులకు ఎమి చేసామన్నదే, ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చామన్నదే ముఖ్యమని చెప్పారు. 4 యేండ్లలలో పెండింగ్ ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకుపోవడం, రీడిజైన్ ద్వారా ప్రాజెక్ట్స్ నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా
చెరువుల పునరుద్ధరణ, పకడ్భందీగా ఉత్తమ నీటి యాజమాన్య పద్దతుల అమలు వంటి అంశాలను తమ శాఖ ప్రాధాన్యత అని మంత్రి హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 5.71 లక్షల ఏకరకు నీరు ఇచ్చారు కానీ మేము మా నాలుగేళ్లో పది లక్షల ఎకరాలు ఈ ఏడాదిలో మరో పది లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు చెప్పారు. మొత్తం మా ప్రభుత్వ హయంలో 24 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు చెప్పారు. అరవై ఏళ్లలో సాధించిన ప్రగతిని, ఈ ఐదేళ్లలో తమ సాగు నీటి శాఖ సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక మిషన్ కాకతీయ దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోను ప్రసంశలందుకుంటోందన్నారు. మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు దీనిపై పరిశోధన చేశారన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రోగ్రాం ప్రారంభించిందని, కర్ణాటక లో బీజేపీ తన మ్యానిఫెస్టోలో మిషన్ కళ్యాణి పేరుతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి చోటిచ్చందన్నారు. ఉమా భారతి బుందేల్ ఖండ్ లో ఇదే పథకాన్ని అమలు చేస్తున్నారని, చెప్పారు. నీతి ఆయోగ్ ప్రసంశలు పొందిన పథకం మిషన్ కాకతీయ అని మంత్రి హరీష్ రావు చెప్పారు. మిషన్ కాకతీయ ద్వాెరా 12 లక్షల ఏకరాలకు సాగు నీరు ఇచ్చామని, చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు 2 నుంచి 3 మీటర్లు పెరిగిందని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చేపల ఉత్పత్తి పెరిగిందని వివరించారు. పది వేల చెరువులు ఒక ఏడాదిలో బాగు చేయడం ఆషామాషీ విషయం కాదని, ఈ సవాల్ ను తమ ఇంజనీర్లు స్వీకరించి దిగ్విజయం చేశారని ప్రసంశించారు. లోయర్ పెన్ గంగ ఆదిలాబాద్ ప్రాజెక్టు 30 ఏళ్ల నుంచి నానుతోందని… ఇలాంటి ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇక ప్రాజెక్టుల వివాదాలు పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయనన్న మంత్రి హరీష్ రావు, గత ప్రభుత్వాలు చెయ్యలేని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారన్నారు. మహారాష్ట్రతో ఐదు ఒప్పందాలు పూర్తి చేసుకుని జలవివాదాలకు తావు లేకుండా చేశారన్నారు. ఛనాకా – కోరాటా బ్యారేజి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరమే ఆదిలాబాద్ కు సాగు నీరు ఇస్తామని చెప్పారు. వలసల జిల్లా, కరువు జిల్లా మహబూబ్ నగర్ కి సాగునీరు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుకుతుందన్నారు. వలసలు పోయిన పాలమూరు రైతులు తిరిగి గ్రామాలకు వచ్చి పంటలు పండిస్తున్నారని చెప్పారు. ఆ జిల్లాలో పంట దిగుబడి పెరగడం వల్ల మహబూబ్ నగర్ లో మార్కెట్ యార్డ్ లో పంటలు గోదాములు సరిపోవడం లేదన్నారు. ఆర్డీఎస్,తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా అలంపూర్ నియోజకవర్గం కు 70 వేల ఎకరాలకు ఈ ఆగష్టులోనే నీళ్లందిస్తామని చెప్పారు. సింగూర్ కింద 3 పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క పంటకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నిజాం కాలం లో నిర్మించిన ఘన్పూర్ ఆనకట్ట కింది ఆయకట్టుకు 25 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు చెప్పారు. ఇక ఖమ్మం జిల్లాలోని సీతారామఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా పథం నుంచి వచ్చిన పథకమని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఖమ్మం జిల్లాను సశ్యశ్యామలం చెయ్యడమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టును 11 నెలల కాలంలో పూర్తి చేసి 3 పంటలకు నీరివ్వడం గొప్ప విజయమని మంత్రి చెప్పారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు ను 2016లో 20 టీఎంసీల సామర్థ్యంతో మేరకు నీటిని నింపామన్నారు. 25 వేల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా, 37 వేల ఎకరాల ఆయకట్టును చెరువుల ద్వారా స్థిరీకరిస్తున్నట్లు చెప్పారు. మిడ్ మానేరు ద్వారా 80 వేల ఎకరాల కొత్త ఆయకట్టు కు నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

harish rao 1     harish rao 2

కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత ప్రయోగం – మంత్రి హరీష్ రావు

తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత ప్రయోగమని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 19 ప్రాజెక్టుల నిర్మాణంతో సమానమన్నారు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, చైనా, జర్మనీ, జపాన్, మన వద్ద బీహెచ్ఈఎల్ నుంచి ఇలా ఆరు దేశాల నుంచి మోటార్లు, పంపులు సరఫరా చేస్తూ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు రూపు దాల్చేందుకు రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మూడు శాఖల నుంచి అనుమతుల సాధన, మరో పది ఇతర కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన సంస్థల అనుమతుల సాధన ఇవన్నీ రికార్డులేనన్నారు. ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టే దిశగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. 139 మెగావాట్ పవర్ సామర్థ్యం తో నడిచే పంపులు వాడటం ఆసియాలోనే తొలి సారని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 145 మెగావాట్ పవర్ సామర్థ్యంతో నడిచే పంపులు వాడి మరో రికార్డు సాధించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు 20 జిల్లాలకు జీవధారగా మారనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం పాత వరంగల్ జిల్లా లేదా ప్రస్తుతం ఉన్నవిభజించబడిన ఐదు జిల్లాలకు, సూర్యపేట జిల్లాకు ఇలా ఆరు జిల్లాలకు అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు అనేకుల నుంచి ప్రసంశలు వస్తున్నయాని చెప్పారు. సీడబ్ల్యూసీ చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్షించి అద్భుతమైన ప్రాజెక్టని కొనియాడారని చెప్పారు. సీ.డబ్ల్యూ.సీ ఇంజనీర్లు, దేశ వ్యాప్తంగా ఉన్న సాగు నీటి శాఖ ఇంజనీర్లను బృందంగా పంపుతామని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాళేశ్వరమని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచన విధానం, దాన్ని అమలు చేస్తోన్న తెలంగాణ సాగు నీటి శాఖ గొప్పతనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1832 కిలోమీటర్లు నీటి సరఫరా చేసే మార్గం, 1531 కిలోమీటర్ల గ్రావీటీ కెనాల్, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెల్, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్ లైన్ , 22 లిఫ్టులు, 21 పంపుహౌజ్ లు, 4627 మెగావాట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఇలా అన్నీ ఒక ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం ప్రపంచ రికార్డేనన్నారు.

సాగు నీటి శాఖకు ఎస్. కే. జోషి దొరకడం అదృష్టం.

సాగు నీటిశాఖలో సుదీర్ఘ కాలం ఓ ఐ.ఏ.ఎస్ అధికారి పని చేయడం అరుదైన విషయమని, అలాంటి ఘనత సాధించిన వ్యక్తి ఎస్. కే. జోషి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఇరిగేషన్ శాఖలో ఆయన పని చేయడం అదృష్టమేనన్నారు. కొన్ని సార్లు ముఖ్యమైన జీవోలు తనే స్వయంగా టైపు చేసి విడుదల చేసిన సందర్భాలున్నాయన్నారు. ఎస్. కే. జోషి అపార అనుభవం తమ ప్రభుత్వానికి, ప్రాజెక్టు పనుల్లో ఎంతో మేలు చేసిందని మంత్రి హరీష్ రావు కొనియాడారు. సాగు నీటి శాఖ సిబ్బంది పండుగలు, సెలవులు లేకుండా పని చేస్తున్నారని కితాబిచ్చిన మంత్రి, మరో నాలుగు నెలలపాటు ఇదే స్ఫూర్తితో పని చేసి ఆయా ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అంతా కలిసి టీెం వర్క్ లా పని చేయాలని సూచించారు. కొత్తగా సాగు నీటి శాఖలో ఉద్యోగాలు పొందిన 650 మంది ఇంజనీర్లకు సీనియర్లు శిక్షణ ఇవ్వాలని సూచించారు. కొత్త ఇంజనీర్లు పని సంస్కృతిని నేర్చుకోవాలని చెప్పారు. కోటి ఎకరాల మాగాణి సీఎం కేసీఆర్ కల అని, దాన్ని నెరవేర్చడానికి అంతా కలిసి పని చేద్దామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తనకు నేరు చెప్పుకోవచ్చని, ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇరిగేషన్ మంత్రిగా అవకాశం దొరకడం తన అదృష్టమైతే…. ఆ శాఖలో ఉద్యోగులుగా పని చేసే అవకాశం రావడం మీ అదృష్టమని చెప్పారు. సాగు నీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ స్టేట్ గా నిలబడేలా పని చేయాలని సూచించారు.

హన్మంత్ షిండే, జుక్కల్ ఎమ్మెల్యే

ఈ సదస్సులో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే మాట్లాడుతూ రాజకీయరంగంలోకి తాను రాకముందు సాగు నీటి శాఖలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ ఇంజనీర్ గా పని చేస్తుంటే, మంత్రి హరీష్ రావు సైట్ ఇంజనీర్ గా ని చేస్తున్నారని కితాబిచ్చారు. మంత్రి హరీష్ రావును తెలంగాణ తొలి ఇరిగేషన్ శాఖకు మంత్రి గా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం అదృష్టమన్నారు. మంత్రి హరీష్ రావు పని తీరు పాదరసంలా ఉంటుందని అభివర్ణించారు.

ఎస్.కే. జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఈ సదస్సులో గౌరవ అతిధిగా పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. కే జోషి సాగు నీటి శాఖ నాలుగేళ్ల ప్రగతిని ప్రకటించడం సంతోషమన్నారు. ఈ శాఖలో తాను సుదీర్ఘంగా పని చేయడం తనకు కలిగిన అదృష్టమని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములవడం చక్కటి పరిణామమన్నారు. ఈ శాఖ సిబ్బంది పని తీరు పట్ల సంతృప్తిగా ఉందన్న సీఎస్ అందిరికీ శుభాకాంక్షలు తెలిపారు.

దేశపతి శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఓఎస్డీ

కాళేశ్వరం ప్రాజెక్టు అందరినీ ఆశ్చర్యపరుస్తోందని ఈ సదస్సులో పాల్గొన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆకుపచ్చ తెలంగాణలో సాగు నీటి శాఖ సిబ్బంది భాగస్వామ్యులయ్యారని ఇది నిజంగా అదృష్టమని చెప్పారు. తెలంగాణ ఉద్యమ పాటలన్నీ నీళ్లమీదే రాసి పా డమని గుర్తు చేసుకున్నారు. మంత్రి హరీష్ రావు నడిచి వస్తుంటే…. ఉద్యమంలో ఓ ఆవేశ స్ఫూర్తి కలిగేదని… ఇప్పుడు నదీ ప్రవాహంలో అనిపిస్తోందని దేశపతి శ్రీనివాస్ కొనియాడారు.

వెంకట్ రెడ్డి, సూర్యపేట రైతు

నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందుతోందని ఈ సదస్సులో పాల్గొన్న సూర్యపేట రైతు వెంకటరెడ్డి చెప్పారు. గతంలో తమ భూములకు నీరు వచ్చేవి కావన్నారు. కాంగ్రెస్ హయాంలో తమ పక్క భూముల రైతులకు వస్తే….తమకు మాత్రం ఆ ఆదృష్టం దక్కలేదన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తమ చివరి ఆయకట్టు భూములుకు నీరు అందుతోందని, ఎకరాకు 40 బస్తాలు పండిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకే దక్కుతుందన్నారు. సాగునీటి నిర్వహణ, ప్రాజెక్ట్ ల పురోగతి నాలుగేళ్ళ ప్రగతి పై ఖైరతా బాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలోని హాలులో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సుకు ఈ ఎన్ సీలు మురళీధర్, నాగేందర్ రావు, ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, చీఫ్ ఇంజనీర్లు, ఇతర సాగు నీటి శాఖ ఉన్నతాధికారులు. పాల్గొన్నారు. నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉత్తమ ఫలితాలు కనబర్చిన ఇంజనీర్లను శాలువా కప్పి, జ్ఞాపిక, ప్రసంశాపత్రాలతో మంత్రి హరీష్ రావు సన్మానించారు.

harish rao 3     harish rao 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *