కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల భూమి పూజ

కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అన్నారు. ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. మేడిగడ్డ ద్వారా కరీంనగర్ జిల్లాలో రెండు పంటలు పండించుకోవచ్చు అని చెప్పారు. పదిహేను నెలల వ్యవధిలో పంప్ హౌజ్‌ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. బ్యారేజీ పూర్తి కాకముందే పంప్ హౌజ్‌ల ద్వారా నీరు వాడుకోవచ్చు అని కేసీఆర్ తెలిపారు.మేడిగడ్డ బ్యారేజీ ద్వారా యాబై నాలుగు కిలోమీటర్ల మేర నీరు ఉంటుందన్నారు.కరీంనగర్‌లో ఇంచు భూమి కూడా మిగలకుండా నీళ్లు పారుతాయని పేర్కొన్నారు. మంథని అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం అద్భుతమైన పర్యాటక కేంద్రం కాబోతుందన్నారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.

kcr eetela - harish              kcr errabelly

ఆలయాన్నిఅద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించడం ద్వారా కరీంనగర్ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు.తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహితకు నీళ్లు తీసుకుని ఆదిలాబాద్ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు. చనకా-కొరటా బ్యారేజీలు నిర్మాణం పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. సమైక్య పాలకులు విడుదల చేసిన జీవోల ఆధారంగా 1300 టీఎంసీలకు లోబడే నీళ్లు వాడుకుంటామని ఉద్ఘాటించారు. పిడుగులు పడ్డా.. భూకంపాలు వచ్చినా 1300 టీఎంసీల నీటిని  వాడుకుంటామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో  స్పీకర్  మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు, ఒడితెల సతీష్, మనోహర్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, ఎమ్మేల్పీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మేల్పీ ఆర్. సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు. ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు, ఒడితెల సతీష్, మనోహర్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, ఎమ్మేల్పీలు భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మేల్పీ ఆర్. సత్యనారాయణ తదితరులు పాల్గోన్నారు.

About The Author

Related posts