కాళేశ్వరం తొలి గేటు బిగింపు-యుద్ధ ప్రాతిపదికన పనులు:మంత్రి హరీశ్ రావు.

కాళేశ్వరం తొలి గేటు బిగింపు.
యుద్ధ ప్రాతిపదికన పనులు.
అన్నారం బ్యారేజీ గేట్ల బిగింపు ప్రారంభం.
80 శాతం పూర్తయిన కాంక్రీటు పనులు.
అన్నారం-కన్నేపల్లి కెనాల్ పనులు 70 శాతం పూర్తి.
పనుల వేగం కోసం డిప్యుటేషన్ పై అదనపు ఇంజనీర్లు.
పది రోజుల్లో పంప్ హౌజ్ ల యంత్రాల దిగుమతి.
ఊపందుకున్న విద్యుత్ పనులు.
వానాకాలం నాటికి ఎల్లంపల్లికి నీరు.
– మంత్రి హరీశ్ రావు.
———————————————

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలోనూ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అన్నారం, సుండిళ్ళ ,మేడిగడ్డ బ్యారేజీలలో 5 కోట్ల 81 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను 4.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు జరిగాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా మూడు బ్యారేజీలు,మూడు పంప్ హౌజ్ ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.శనివారం మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.బ్యారేజీలు, పంఫౌజ్ ల పనులను ఆయన తనిఖీ చేశారు.అన్నారం బ్యారేజీ గేట్ల బిగింపు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. మంత్రి ఈ పనులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీకి 66 , మేదిగడ్డ కు 86, సుందిళ్ళ బ్యారేజీకి 74 గెట్లను అమర్చవలసి ఉంది.అన్నారం బ్యారేజికి శనివారం తొలి గేటు బిగించారు.కాళేశ్వరం కు సంబంధించిన బ్యారేజీలు, పంప్ హౌజ్ పనుల్లో 80 శాతం సిమెంటు కాంక్రీటు పనులు పూర్తయినట్టు మంత్రి ప్రకటించారు. మిగతా 20 శాతం పనులు మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.అన్నారం-కన్నేపల్లి మధ్య గ్రావిటీ కెనాల్ పనులు 70 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు మీడియా ప్రతినిధులకు చెప్పారు. కాళేశ్వరం పనుల పురోగతిపై మంత్రి హరీశ్ రావు కన్నెపల్లి దగ్గర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అమేయ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నల్ల వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.వేసవి కాలంలో రాత్రి వేళల్లో పనుల వేగం కోసం అవసరమైన చోట కొందరు ఇంజనీర్లను డిప్యుటేషన్ పై నియమించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు.కన్నేపల్లి, మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం పంప్ హౌజ్ లకు అవసరమైన యంత్రాలు మరో పది రోజుల్లో దిగుమతి కానున్నట్టు మంత్రి చెప్పారు.జపాన్, స్విట్జర్ల్యాండ్ , ఆస్ట్రియా వంటి దేశాల నుంచి ఈ యంత్ర సామాగ్రి రవాణా అవుతున్నట్టు హరీశ్ రావు తెలియజేశారు.కన్నేపల్లి దగ్గర్ గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ , హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఫోర్ బే వరకు చేరిన నీటిని శక్తివంతమైన విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తి అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించనున్నారు.ఇందుకోసం కన్నేపల్లి పంపు హౌజ్ లో 17 మోటార్లు అమర్చుతున్నారు.నీటిని పంపింగ్ చేయడానికి గాను 5 మీటర్లు, 3.5 మీటర్ల వ్యాసార్ధం తో ఉన్న భారీ పైపులను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.కన్నేపల్లి పంపు హౌజ్ నుంచి దాదాపు కిలోమీటరున్నర దూరం వరకు పైపుల ద్వారా నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బ్యారేజీలోకి నీటిని నింపనున్నారు.కన్నేపల్లి-అన్నారం మధ్య అటవీ ప్రాంతంలో తలపెట్టిన 13.35 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులను మంత్రి హరీష్ రావు శనివారం స్వయంగా పరిశీలించారు.ఈ కెనాల్ పనుల్లో మట్టి పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.స్ట్రక్చర్ల నిర్మాణం సహా అన్నీ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఇంజనీర్లు, ఏజన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ నిర్మాణాల్లో ఈ అప్రోచ్ కెనాల్ పనులు అత్యంత కీలకమని మంత్రి అభిప్రాయపడ్డారు.ఈ కెనాల్ పనులు మే 31 కల్లా పూర్తి చేయాలని డెడ్ లైను విధించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో విద్యుత్ పనులు మరింత ఊపందుకున్నాయి.విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ప్రాజెక్టు అవసరాలకు ప్రత్యేక విద్యుత్ లైన్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రాజెక్టులో ప్రధానమైన బ్యారేజీలు, పంప్ హౌజ్ ల కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు, ప్రత్యేక లైన్ల ఏర్పాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి.విద్యుత్తు అవసరాల సామర్ధ్యానికి  అనుగుణంగా పనులు పూర్తవుతున్నాయి.జైపూర్ లోని సింగరేణికి చెందిన పవర్ ప్లాంట్ ద్వారానే ప్రత్యేకంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల పంప్ హౌజ్ లకు వేర్వేరుగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోలివాడ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కన్నేపల్లి దగ్గర నిర్మిస్తున్న పంప్ హౌజ్ వరకు 80 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైను లాగుతున్నారు.40 మెగావాట్ల సామర్ధ్యంతో 11 మోటార్లకు గాను 440 మెగావాట్ల విద్యుత్తు అవసరం.220/11 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి. విద్యుత్ లైన్ పనులు 40 శాతం , టవర్లు 14 శాతం,అటవీ మార్గంలో 9 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైను ఉన్నది.180.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్నాయి.పెద్దపల్లి జిల్లా గోలివాడ లో జరుగుతున్న సుందిళ్ళ పంప్ హౌజ్ కోసం జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి 6 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైను పనులు జరుతున్నాయి.40 మెగావాట్ల సామర్ధ్యంతో 9 మోటార్లకు గాను 360 మెగావాట్ల విద్యుత్ అవసరం.400/220/11 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణం జరుతున్నది.దీని పనులుకూడా 60 శాతం పూర్తయ్యాయి.400 కె.వి.విద్యుత్తు డబుల్ సర్క్యూట్ లైన్ పనులు 75 శాతం పూర్తయ్యాయి.205.78 కోట్ల వ్యయతో దీన్ని నిర్మిస్తున్నారు.అన్నారం పంప్ హౌజ్ కోసం 40 మెగావాట్ల సామ్ర్ధ్యంతో 8 మోటార్లకు గాను 320 మెగావాట్ల విద్యుత్తు అవసరం.220/11 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి.విద్యుత్ లైను పనులు 45 శాతం, టవర్ల ఎరక్షన్ పనులు 10 శాతం పూర్తయ్యాయి.దీనిని 99.48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన  ఎత్తి పోతల పథకాలకు అవసరం అయిన విద్యుత్ కోసం విద్యుత్ శాఖ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. మొత్తం ఎత్తి పోతల పథకాలకు 12,500 మెగావాట్ల విద్యుత్ అవసరం అని అంచనా వేశారు. వచ్చే వానాకాలం నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్లు పని చేయనున్నవి.విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏర్పాటు వేగవంతం చేయాలని  కాలేశ్వరం పనులను క్షేత్రస్థాయిలో సందర్శించినప్పుడే మంత్రి హరీష్ రావు  ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో గడువులోగానే విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, పంపిణీ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేయడానికి ట్రాన్స్ కో  సన్నాహాలుచేస్తున్నది.విద్యుత్, ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు నిరంతరం సమీక్షిస్తున్నారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం 2018 జూన్ నాటికి 12,500 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుందని అధికారిక అంచనా.ఈ మేరకు విద్యుత్ సరఫరాకు సంబంధించి ట్రాన్స్క్ కో  అన్ని చర్యలు తీసుకుంటున్నది.  కాళేశ్వరం పంపు హౌజ్ లపనులు త్వరలోనే పూర్తి చేయడానికి టైం లైన్ పెట్టుకున్నందున విద్యుత్ సంస్థలు తమ పనులను మరింత వేగవంతం చేశాయి. ప్యాకేజీల వారిగా పంపింగ్ స్టేషన్‌లను పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించుకున్నది. వచ్చే ఖరీఫ్‌లో  కాళేశ్వరం ద్వారా ఆరునూరైనా  సాగునీటిని అందించడానికి మంత్రి హరీష్ రావు నిరంతరం సమీక్షిస్తున్నారు.ఆకస్మిక పర్యటనలు జరుపుతున్నారు.కాళేశ్వరం కోసం 59 విద్యుత్ టవర్ల ఏర్పాటు పూర్తి చేయనున్నారు. రానున్న రోజుల్లో ఇరిగేషన్, విద్యుత్ సంస్థలు మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని  మంత్రి హరీష్ రావు అభిప్రాయపడుతున్నారు.ఇందుకోసం  ఇరిగేషన్, ట్రాన్స్ కో చెందిన ఉత్సాహ వంతులైన ఇంజనీర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా గతంలో ఆయన  సూచించారు. ఒక్కో ప్రాజెక్టు వద్ద ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, అందులో  ఈ టీమ్ పని చేయాలని మంత్రి ఆదేశించారు.కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్‌మానేరుకు నీరు అందితేనే మిషన్ భగీరథ పథకం అమలు సాధ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే చెప్పారు.బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, కరకట్టలు, కాలువలు, రిజర్వాయర్లు తదితర పనులన్నీ సమాంతరంగా జరిపేందుకు చర్యలు చేపట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ  వద్ద 365 రోజులు నీరు అందుబాటులో ఉంటున్నందున ఎప్పుడు ఎంత పని జరిగితే అంత మేర నీటిని తరలించి చెరువులు నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఒకే కేంద్రం నుంచి కాకుండా వేర్వేరు జనరేషన్ స్టేషన్ల ద్వారా విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏమాత్రం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేయడానికి ట్రాన్స్ కో సన్నాహాలు చేస్తున్నది.ఉత్తర భారతదేశంతో దక్షిణాది రాష్ట్రాలతో విద్యుత్ గ్రిడ్ అనుసందానం చేసే ప్రక్రియ వేగవంతంగా అమలవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి విద్యుత్ గ్రిడ్ అనుసందానం కూడా పూర్తవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.కాళేశ్వరం విద్యుత్ పనుల పురోగతిని ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ సలహారు పెంటారెడ్డి నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.    IMG-20180317-WA0264 IMG-20180317-WA0287

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.