కాళేశ్వరంలో పుష్కర భక్తులకు సకల సౌకర్యాలు: జాయింట్ కలెక్టర్

కాళేశ్వరం: గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చు భక్తులకు కాళేశ్వరం లో సకల సౌకర్యాలు కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. బుధవారం ఆమె ఉదయం పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరాల సందర్భంగా జాయింట్ కలెక్టర్ కాళేశ్వరంలోనే బస చేస్తున్నారు. పుష్కరాల ప్రారంభం రోజు భక్తులకు కలిగిన చిన్న చిన్న అసౌకర్యాలను గమనించిన జాయింట్ కలెక్టర్ పుష్కర ఘాట్ల వద్ద టెంట్లు వేయించారు. ఎండ వేడిమి అధికంగా ఉన్నందున దారి పొడవున వాలెంటర్లను నియమించి భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి పుష్కర ఘాటు వద్ద అదనంగా ప్రత్యేక అధికారులను నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సూచనలు, సలహలు ఇప్పిస్తూ సులువుగా, షీఘ్రంగా పుష్కర స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గోదావరి నీటిని ప్రతి గంటకు ఒక్కసారి నీటి కాలుష్యతను పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. బస్టాండు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఆటోలను అనుమతించ నందున పిల్లలు, వృద్ధులు పుష్కర స్నానాలకు నడిచి వెళ్లుటకు భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే బస్గాండు నుంచి పుష్కర ఘాట్ల వరకు ఆటోలు నడుపుటకు వెంటనే ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల నుండి ఆటోల వారు అధిక చార్జీలు వసూలు చేయకుండా ప్రతి ఒక్కరికి 10రూపాయల చొప్పున చార్జీలు నిర్ధారించి ఆటోలకు అతికించారు. ఆటోలు నడుచుట వలన పుష్కర భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధులకు గోదావరిలోకి వెళ్ళకుండా ఘాట్ల వద్దనే షవర్ బాత్ లను ఏర్పాటు చేయించారు. కాళేశ్వరంనకు పుష్కర భక్తులు
ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఘాట్ల వద్ద గోదావరిలో అదనంగా హైమాస్ లైట్లు ఏర్పటు చేశారు. అలాగే భక్తులు పుష్కర స్నానం అనంతరం స్వామివారి దర్శనార్ధం ఏర్పాటు చేసిన క్యూ లైన్ల పై భక్తుల నీడకు తడకలతో పందిర్లు వేయించారు. మొత్తం క్యూ లైన్ల పక్కన వాలంటర్లను నియమించి భక్తులకు త్రాగు నీటిని అందించుటకు ఏర్పాట్లు చేయించారు. దేవాలయంలో భక్తులకు ఎప్పటి కప్పుడు దర్శనం సులువుగా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారి లడ్డు ప్రసాదం కౌంటర్లను పెంచి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పట్లు చేశారు. రోజు ఉదయం 6గంటల నుండి రాత్రి వరకు పుష్కరాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షిస్తు అధికారులకు తగిన సూచనలు, సలహలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా పుష్కరాలలో పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆలయ పరిసరాలలో పారిశుద్ద్య పనులను ఆమె పరిశీలించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులందరు త్రాగు నీటి బాటిళ్లను వెంట తీసుకెళ్ళాలని ఆమె సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *