కాళేశ్వరంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు

కాళేశ్వరంలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు

కాళేశ్వరం: గోదావరి మహ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో సమాచార,  పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జోన్-5, వరంగల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఛాయాచిత్ర ప్రదర్శన సంచార వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన సంచార వాహనంలో రాష్ట్ర్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పధకాలతో కూడిన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో జోన్-5 పరిధిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, జిల్లాలకు సంబంధించి టూరిజం, గిరిజన సంస్కృతి, జానపద, సాంప్రదాయాలపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చిన భక్తులకు విశ్రాంతి తీసుకునే సమయంలో అధిక సంఖ్యలో సంచార వాహనంలో గల ఫోటో చిత్రాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం మీడియా సెంటర్ వద్ద కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్ధానం ముందు పుష్కరాల ప్రారంభం నుండి వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పుష్కరాల ప్రత్యేక అధికారి మీడియా సెంటర్ సహయ
సంచాలకులు మహమ్మద్ ముత్తుజా భక్తులకు తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతిపై ఏర్పాటు చేసిన ఫోటోల వివరాలను భక్తులకు వివరిస్తున్నారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన ఆడియో, వీడియో సూపర్ వేజర్ పి. సుధాకర్, సిబ్బంది ఎన్.సంపత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *