కాళేశ్వరంను అడ్డుకునేవారిని రైతులు తరిమిగొట్టాలి: మంత్రి హరీశ్ రావు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను మంత్రి హరీశ్ రావు బుధవారం నాడు ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామ శివారులో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అడుకునే వారిని రైతులే తరిమి కొట్టాలని  మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చేందుకు రాత్రింబవళ్లు పని చేస్తున్నట్టు తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి అడుగు రైతు కోసమే వేస్తున్నామని అన్నారు. రైతు కంటే తమకేదీ ముఖ్యం కాదన్నారు. అవసరమైన కరెంటు మాత్రమే వాడుకుని భూగర్భ జలాలు కాపాడాలని రైతులను కోరారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 17వేల ఎకరాలలో ఇప్పటికే 16వేల ఎకరాల భూ సేకరణ పూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు. ఇంకా వెయ్యి ఎకరాల భూసేకరణ మిగిలి ఉందని చెప్పారు. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో .150లక్షల వ్యయంతో నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్ ను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ద్వారా గొడుగుపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలైన దీపాయంపల్లి, కొనాపూర్ లకు విద్యుత్ సరఫరా కానున్నది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో 46 సబ్ స్టేషన్ కాగా, దౌల్తాబాద్ మండలంలో ఐదవ సబ్ స్టేషన్ అని వివరించారు. నియోజకవర్గంలో 46వ సబ్ స్టేషన్ అని, ఇంకా 4 సిద్ధమవుతున్నాయని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 56 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని హరీష్ తెలిపారు. ప్రతి రెండు గ్రామాలకు  ఒక సబ్ స్టేషన్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్నదన్నారు.  మండలానికి 8 నుంచి 10 విద్యుత్ సబ్ స్టేషన్లు తెచ్చుకున్నామని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల హాయాంలో యాసంగి పంటలు చేతికొచ్చేలోపు  లో ఓల్టేజీతో మోటార్లు కాలిపోయేవని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో లో ఓల్టేజీ సమస్య లేదన్నారు. మోటార్లు కాలిపోయే ప్రసక్తి లేదని మంత్రి చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతులే కేసీఆర్ కు ప్రాధాన్యమని తెలిపారు. రైతుల కోసం ఆలోచన చేసే ఏకైకప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎం.పి.కొత్త ప్రభాకరరెడ్డి తెలిపారు.

harish rao 1     harish rao 2

అన్ని విషయాలలో రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమన్యాయంచేస్తున్నదన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలకు గోదావరి జలాలు వచ్చేలా ప్రభుత్వం డిజైన్ చేసిందన్నారు24 గంటల పాటు కరెంటు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ అన్ని రకాలుగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎం.పి.చెప్పారు.మల్లన్న సాగర్ నీళ్లతో దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని ఎం.ఎల్.ఏ.ఎస్.రామలింగారెడ్డి చెప్పారు.దేశంలోనే 24 గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్సే నని ఆయన అన్నారు.సబ్ స్టేషన్లు మంజూరు చేయించిన మంత్రి హరీశ్ రావుకు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.దౌల్తాబాద్, రాయపోల్ మండలానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా కాల్వల పరిశీలించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ లేకుంటే కాల్వలు లేవని, 24 గంటలు కరెంటు ఉండేది కాదన్నారు.  మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక నియోజకవర్గం పరిధిలో లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్టు ఎం.ఎల్.ఏ తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను తలపించే రీతిగా ఆకుపచ్చ తివాచీలు కప్పుకున్న దుబ్బాకగా మారుతుందని సోలిపేట చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం  24 గంటలు పని చేస్తున్న  మంత్రి అని హరీష్ రావును కొనియాడారు.సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఇంజనీర్లుగా మారిపోయారన్నారు.

harish rao 3    harish rao 4

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *