కాలువలో మూడు రోజుల పసికందు

కరీంనగర్ : చొప్పదండు శివారు ఎస్సారెస్పీ కాలువ.. పుట్టి మూడు రోజులైన చిన్న పాప అరుపులు ఆ కాలువ నుంచి వినిపించాయి. అరుపులు విన్న రైతు చత్రపతి కాలువలో చూడగా ఆడశిశువు కనిపించింది. వెంటనే చుట్టు పక్కవారికి సమాచారం అందించిన చత్రపతి శిశును కాలువ గట్టకు చేర్చి విషయం పోలీసులకు విషయం తెలిపాడు. అయితే సమయానికి శిశువును స్థానికులు చూడడంతో ప్రమాదం తప్పింది. లేనట్లయింతే కుక్కలు, ఇతర జంతువులు శిశువును చంపేశాయి.

babu

చొప్పదండిలో శిశువు ఎవరిదనేది ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆ శిశువును 108లో కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తెల్ల వారకే ముందే శిశువును కాలువలో వదిలిపెట్టారని పోలీసులు భావిస్తున్నారు. అనాథ శిశువును కరీంనగర్ లోని శిశుగృహకు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *