‘కాలింగ్ బెల్’ సెన్సార్ పూర్తి

కాలింగ్ బెల్ సెన్సార్ పూర్తి

రవివర్మ, కిషోర్, సంకీర్త్ వ్రితి ఖన్నాప్రధాన పాత్రల్లో గోల్డెన్ టైమ్ పిక్చర్స్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వంలో అనూద్ నిర్మిస్తున్న హర్రర్ ధ్రిల్లర్ ‘కాలింగ్ బెల్’.ఈ చిత్రం
ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ – ‘‘ఒక డిఫరెంట్ కధాంశంతో హర్రర్ ధ్రిల్లర్ గా తెరకెక్కిన
మా ‘కాలింగ్ బెల్’చిత్రం సెన్నార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. ఒక మంచి చిత్రాన్ని తీశామన్న కాన్ఫిడెన్స్ మాకు కూడా వచ్చింది.
హర్రర్ చిత్రాలకు, ధ్రిల్లర్లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆ కోవలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ ‘కాలింగ్ బెల్’ చిత్రాన్ని
రూపొందించడం జరిగింది. ఇటీవల హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేసిన టీజర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈనెల 13న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కాబోతోంది. పాటలు
కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. ఆద్యంతం ఆడియన్స్ ని ధ్రిల్ చేసే ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది’’అన్నారు. నిర్మాత అనూద్
మాట్లాడుతూ -హర్రర్ సినిమా తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఆ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో వుండాలి. ఆ స్టాండర్స్ ని హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ టెయిన్ చేస్తూ
ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు కూడా అందుకున్న మా చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు
కూడా నచ్చుతుందన్న నమ్మకం మాకు వుంది. హర్రర్ సినిమాలో మ్యూజిక్ కి ఎంతో ప్రాధాన్యత వుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పాటులు రీ- రికార్డింగ్ విషయంలో
ఎక్కువ కేర్ తీసుకున్నామన్నారు. ఈ చిత్రంలోని పాటల్ని టాప్ సింగర్స్ అయిన కార్తీక్, బాబా సెహగల్, గీతామాధురి, ప్రణవి, శ్రావణ భార్గవిలతో పాడించడం జరిగింది.
సుకుమార్ గారు రీ-రికార్డింగ్ చాలా ఎక్స్ లెంట్ గా చేశారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 13న చాలా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం. త్వరలోనే చిత్రాన్ని కూడా విడుదల
చేయడానికి సన్నాహలు చేస్తున్నాం అన్నారు. జీవా, గాంధీ, చంటి, శంకర్, వేణు, మమతా, రాహుల్ మిగతా పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుకుమార్ పి,
సినిమాటోగ్రఫీ: వివేక్ యస్.కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సోలోమన్, నిర్మాత్ అనూద్, కధ-స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: పన్నా రాయల్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *