కార్మిక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించిన మంత్రి నాయిని నరసింహారెడ్డి

రాష్ట్ర హోం , కార్మిక శాఖా మంత్రి నాయిని నరసింహా రెడ్డి కార్మిక శాఖ పరిదిలోని కార్మిక, ఉపాది కల్పన, శిక్షణ , ఇన్సూరెన్స్ & మెడికల్ సర్వీసెస్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ ల బడ్జెట్ ప్రతిపాదనలను బుదవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు. కార్మిక శాఖ లోని వివిధ విభాగాలలో చేపట్టిన నూతన పథకాలను గురించి అధికారులతో ఆయన చర్చించారు. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించేందుకు ప్రవేశపెట్టిన “తెలంగాణ ఓవర్సీస్ మాన్ పవర్ కంపెనీ (టాం కాం)” అమలు తీరుతెన్నులపై మంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించారు. వచ్చే ఆర్దిక సంవత్సరంలోనూ “టాం కాం” కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టాలని మంత్రి సూచించారు.
కార్మిక శాఖా ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ కె.వై.నాయక్, డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ & మెడికల్ సర్వీసెస్ డా.దేవికారాణి , డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కిషన్ , డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ విజయ్ కుమార్ , డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్ శ్యాం సుందర్ జాజు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భవన నిర్మాణ అనుమతుల సందర్బంలోనే సెస్ వసూలు చేయాలి
సెస్ చట్టం అనుసరించి భవన నిర్మాణ సంస్థలు నిర్మించే నిర్మాణాలు/ వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలోనే సెస్ ను వసూలు చేయాలని ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మొత్తం భవన నిర్మాణ వ్యయంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు 1% సెస్ వసూలు చేసే విదానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలనే వ్యవహారంపై సంబందిత అధికారులతో మంత్రి చర్చించారు. భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే శాఖల అధికారులు 1 % సెస్ విషయంలో ప్రణాళికాబద్దంగా కృషి చేసినట్టయితే “భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల మండలి” ని బలోపేతం చేయవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్ మెంట్ కార్యదర్శి నవీన్ మిట్టల్, జి.హెచ్.ఎం.సి కమీషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిదుల ద్వారా కొనసాగుతున్న పథకాలపైన చర్చ
కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా కొనసాగుతున్న పథకాలపైన మంత్రి ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు. కేంద్రప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రదానమంత్రి కౌశల్ వికాస యోజన (PMKVY), ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్, మోడల్ ఐ.టి.ఐ.లు / మల్టి స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లు, స్కిల్ డెవలప్ మెంట్, అప్రెంటిస్ షిప్ & ట్రైనింగ్, ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్లు వంటి పథకాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఆయా పథకాల నుంచి రావాల్సిన నిదులపై అవసరమైతే డిల్లీ కి వెళ్లి సంబందిత అధికారులతో చర్చించాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *