కార్పోరేషన్లలో అభివృద్ది పనులపై మంత్రి కేటిఆర్ సమీక్ష

 

  • వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాల   ఎమ్మెల్యేలు   పాల్గోన్నారు
  • కార్పోరేషన్లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నదని, దీంతో అభివృద్ది పనులు వేగంగా జరిగేలా చూస్తాం
  • కార్పోరేషన్ల కమీషనర్లు, మేయర్లు,  ఎమ్మెల్యేలు, యంపిలతో ఈ నెల 10 తేదిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశం
  • వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులపైన మంత్రి కెటి రామారావు పురపాలక శాఖాధికారులతో సమీక్ష

రాష్ర్టంలోని కార్పోరేషన్లలోని అభివృద్ది కార్యక్రమాల మీద పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని మెట్రో రైల్ భవన్ లో జరిగి ఈ సమావేశంలో వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాల  ఎమ్మెల్యేలు పాల్గోన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఉన్న హమీలు, వాటి తాలుకు పురోగతిపైన మంత్రి, ఏంఏల్యేల నుండి సమాచారం తీసుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం కార్పోరేషన్లకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నదని, దీంతో అభివృద్ది పనులు వేగంగా జరిగేలా చూస్తామని మంత్రి కెటి రామారావు తెలిపారు. అయా కార్పోరేషన్ల వారీగా జరుగుతున్న అభివృద్ది పనులను మంత్రి  ఈ సందర్భంగా సమీక్షించారు. అయా పట్టణాల అవసరాలకు అనుగుణంగా అవసరం అయిన పలు ప్రాజెక్టులను, కార్యక్రమాలను యంఏల్యేలు మంత్రికి తెలిపారు. పట్టణాల్లో జరుగుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుని పోవాలని మంత్రి అయా జిల్లా కలెక్టర్లకు పోన్ చేసి మాట్లాడారు. అయా పనులకు టెండర్లను పిలవాలని, టెండర్లు పూర్తయిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. దీంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడిన మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు అనుమతులు త్వరగా ఇప్పించాలని కోరారు. త్వరలోనే కార్పోరేషన్ల కమీషనర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, యంపిలతో ఈ నెల 10 తేదిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కార్పోరేషన్లలోని పనులు, ప్రతిపాధనలకు తీసుకుని వచ్చేలా కమీషనర్లకు అదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు అదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని కార్పోరేషన్ గా చేయాలని ఎమ్మెల్యే  శ్రీనివాస్ గౌడ్ మంత్రి కెటి రామారావును కోరారు. పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుకుంటే తప్పకుండా ప్రయత్నం చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు.

వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులపైన మంత్రి  కెటి రామారావు పురపాలక శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా పురపాలక సంస్ధల చెత్త సేకరణ ద్వారా విద్యుత్ తయారీకి ఉద్దేశించిన ప్రాజెక్టుల వివరాలను మంత్రికి అధికారులు అందించారు. ఈ సందర్భంగా జియచ్ యంసి పరిధిలోని పలు ప్రాజెక్టులను జియచ్ యంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి వివరించారు. వీటితోపాటు, ఇతర పట్టణాల్లోని ప్రాజెక్టులు పలు కారణాలతో అగిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కంపెనీలతో వచ్చే వారంలో మాట్లాడి, అయా ప్రాజెక్టులను ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులను అదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *