Breaking News

కారు డ్రైవర్ కేసీఆర్ గురించి గొప్పగా చెప్పారు..

kcr ramansingh

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే చత్తీస్ గడ్ సీఎం రమణ్ సింగ్ తెలంగాణ విద్యుత్ కోతల గురించి ఆయన ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ ను అడిగారట.. కోతలు లేవు అనగానే ఆశ్చర్యపోయారట.. సీఎం కేసీఆర్ సీఎం అయ్యాక కష్టాలు తీరాయని డ్రైవర్ చెప్పగానే సంభ్రమాశ్చార్యాలకు లోనయ్యాడట చత్తీస్ ఘడ్ సీఎం..

అనంతరం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో శుక్రవారం రాత్రి కలిసినప్పుడు చత్తీస్ ఘడ్ సీఎం ఇదే విషయాన్ని కేసీఆర్ తో పంచుకున్నాడు.. ఇంత త్వరగా విద్యుత్ కోత అభినందించిన కేసీఆర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.. తెలంగాణ లో దాదాపు 6 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా.. విద్యుత్ కోతలు లేకపోవడంపై కేసీఆర్ ను ప్రశంసించారు.

కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, ఇండస్ట్రీయల్ పాలసీ దేశంలోనే పేరొందిందని.. ఈ పథకాలు తాము ఆచరిస్తామని తెలిపారు. తెలంగాణ కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రంగా ఆవిర్బవించిందని.. తాము ధనిక రాష్ట్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రమణసింగ్ ను సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *