‘కారు’లో షికారు చేస్తూ పాలించండి

పాలనకు, ప్రజలకు చేరువకావడానికి అధికారులకు ఏం అవసరం.. చెప్పండి ఏం అవసరం.. నిబద్ధత, నీతి నిజాయితీ అనేగా మీ సమాధానం.. కానీ కాదు.. సీఎం కేసీఆర్ దృష్టిలో అవేవీ కావు.. అందుకే పాలనకు ప్రజలకు చేరువయ్యేందుకు సీఎం ఉపయోగించే ఖరీదైన ఫ్యార్చూనర్ కార్లు అని గుసగుసలాడుకుంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు..

ప్రజలకు సేవ చేయడానికి నడిచిపోయిన ఐఏఎస్ లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నడిచిపోయేంత లేదుకానీ వారికి కూడా టాయోటా ఇన్నోవాలు ఉన్నాయి. కానీ సీఎం కేసీఆర్ మాట వినడం లేదో.. లేక ప్రభుత్వ పథకాల అమలు జాప్యమో ఏమో కానీ సీఎం పది జిల్లాల కలెక్టర్లకు, సీనియర్ ఐఏఎస్ లకు తాయిళాలు ప్రకటించారు. అవే ఖరీదైన ఒక్కోటి 25 లక్షల పైన ఖరీదైన ఫార్చూనర్ కార్లు.. అవును కలెక్టర్లకు ఈ కార్లు ఇవ్వడానికి సీఎం నిర్ణయించారు. వాటి కోసం నిధులు కూడా విడుదల చేశారు. అధికారులు, పోలీసులకు ఖరీదైన కార్లిచ్చి భలే హ్యాండిల్ చేసి తనవైపు తిప్పుకుంటున్నకేసీఆర్ నయా ఐడియాకు టీఆర్ఎస్ నాయకులే గులాం అవుతున్నారు. వాట్ ఎన్ ఐడియా కేసీఆర్ జీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *