Breaking News

కాపులు వర్సెస్ బీసీలు

04-1430717523-r-krishnaiah-600

‘ఏపీలో నాయకులే లేనట్టు తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో రాజకీయాలు చేయడం ఏంటి..? ఆయన తెలంగాణ రాజకీయాలు చూస్తే మంచింది’ ఇది ఏపీ కాపుల ఉద్యమ నేత ముద్రగడ వ్యాఖ్య ఇది. విజయవాడలో బీసీల సమావేశాన్ని నిర్వహించిన బీసీసంఘం నేత తెలంగాణ ఎమ్మెల్యే, ఆర్.క్రిష్ణయ్యపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించడం పద్దతి కాదన్నారు… విజయవాడలో ఆయన బీసీ నేతలతో సమావేశమై కాపులను బీసీల్లో చేర్చితే ఉద్యమిస్తామనడంపై కాపులు మండిపడుతున్నారు. ఏపీల్లో బీసీలే లేనట్టు తెలంగాణ నేతను తీసుకొచ్చి కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.. కాపుల రిజర్వేషన్ల అంశంను నీరుగార్చేందుకే ఇలా బీసీ సంఘం నేతలను తీసుకొస్తున్నారని భగ్గుమంటున్నారు.. తెలంగాణ బీసీసంఘం నేత క్రిష్ణయ్య ఈ సందర్భంగా విజయవాడలో మాట్లాడుతూ అయితే తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబును సైతం ఈ విషయంలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి అనక తనను పట్టించుకోకుండా మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో కూడా కాపులను బీసీల్లో చేరుస్తామని.. ఇప్పుడు బీసీల పేరుచెప్పి అన్యాయం చేశాడని క్రిష్ణయ్య విమర్శించారు.  మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు ఓట్ల కోసం ఆడిన ఆట ఇప్పుడు ఆయనకు తలనొప్పులు తీసుకొస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *