Breaking News

కాపీనే.. కానీ అద్భుతంగా మలిచాడట..

Kumari-21-F-First-Look-Poster

సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించి నిర్మించిన చిత్రం కుమారి 21ఎఫ్. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక చిత్రంపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ సందడి చేస్తున్నాయి. సినిమా ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అనే పేర్లతో సహా నెట్ లో పెట్టేశారు కొందరు ఔత్సాహికులు.. ‘లీలా సేస్’ అనే ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టాడనే టాక్ వినిపిస్తోంది.. అలాగే అర్జెంటీనా సినిమా ‘సీక్రెట్ ఇన్ దెయిర్ ఐస్’ అనే ఆ మూవీ లోని సీన్స్ కి ఇన్స్ పిరేషన్ అట.. ఆ సినిమాలాగానే డిట్టో క్లైమాక్స్ ఉందని గుసగుసలాడుతున్నారు.

మొత్తానికి సుకుమార్ తీసిన ఈ సినిమా కాపీ అయినా అదరగొట్టాడని కథ, స్ర్కీన్ ప్లే అదిరిందని అందరూ చెప్పుకుంటున్నారు. చూసిన వారు సైతం సినిమా బాగుందంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *