కాన్సర్ చిన్నారిని పరామర్శించిన చిరు

హైదరాబాద్, ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురువారం నాడు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారిని పరామర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఆయన పరామర్శించారు. తనను పరామర్శించేందుకు చిరంజీవే స్వయంగా రావడంతో చిన్నారి బాలు ఆనందించాడు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా – చిరు..
ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి మాట్లాడారు. అదిలాబాద్ జిల్లా జిన్నారంకు చెందిన బాలు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని..ఆయన తనను చూడాలని అభిలాష వ్యక్తం చేస్తున్నట్లు సమాచారంతో తాను ఇక్కడకు వచ్చానన్నారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి బాలుడికి ముద్దు ఇచ్చారు. పూర్తిగా నయమయ్యాక తన ఇంటికి రావాలని బాలుడిని ఆహ్వానించారు. ఇంటికి వస్తే, ఎవరు ఇంట్లో లేని సమయంలో ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామని చిరంజీవి అన్నారు.

ఎవరీ బాలుడు..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడేగామ గ్రామానికి చెందిన శ్రీధర్, పద్మ దంపతులకు బాలు (11) అనే కుమారుడున్నాడు. హార్ట్‌ స్కిన్ లింపోవ వ్యాధితో బాలు బాధపడుతున్నాడు. రెండు నెలల క్రితమే నాంపల్లిలోని ఎం.ఎన్.జె. కేన్సర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుకు చిరంజీవి అంటే ఎంతో అభిమానం. అతనిని చూడాలని కోరిక ఉండేది. ఈ విషయం తెలుసుఉన్న మేక్ ఏ విష్ సంస్థ బాలుకు హామీనిచ్చింది. ఆ మెగాస్టార్‌ను ఇక్కడికి తీసుకొస్తామని చెప్పింది. అప్పట్నుంచి బాలు ఆరోగ్యం దినదినం మెరుగుపడుతూ వస్తోంది. దీనితో బాలు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మేక్‌ ఏ విష్ సంస్థ చిరంజీవిని ఆస్పత్రికి తీసుకొచ్చింది. దీంతో పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.