
మహ-బాద్ జిల్లా: పెద్దవంగర మండలం కాన్వాయిగూడెం గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషాదయాకర్ రావు. గ్రామంలోని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. భూగర్భజలాలు పెంపొందించాలంటూ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చైతన్య ర్యాలీలో పాల్గొన్నారు.