
ఆ కానిస్టేబుల్ నిజాయితీ చాటుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం.. పోలీసు .. ఇంకేముంది లంచాలు దండిగా సంపాదించుకోవాలనుకున్న ఆశ ఉన్న పోలీసు వ్యవస్థలో మేటి రత్నంలా నిజాయితీగా ఉన్నాడు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నారాయణ రావు జూబ్లిహిల్స్ లో ఓ డాక్టర్ ఇంటికి పాస్ పోర్టు వెరిఫికేషన్ కు వెళ్లి విచారణ చేశాడు. తిరిగి వస్తుండగా కొంత డబ్బును దరఖాస్తుదారులు ఇవ్వచూపగా నిరాకరించాడు. తమకు సీఎం కేసీఆర్ భారీగా జీతాలు పెంచారని.. సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని మాకు లంచం వద్దంటూ తీసుకోకుండా వెళ్లిపోయారు.
ఆ విషయం తెలిసిన సీఎం కేసీఆర్ ఆ కానిస్టేబుల్ ను స్వయంగా ఇంటికి పిలుపించుకొని అభినందించారు. ఆయనలాగా నిజాయితీతో పనిచేయాలని పోలీసులను కోరారు.