
కరీంనగర్ : ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా టాపర్ గా నిలిచిన గంభీరావ్ పేట కానిస్టేబుల్ బి. తిరుమలయ్య కూతురు శ్వేతకు జిల్లా అడిషనల్ ఎస్పీ బి. జనార్దన్ రెడ్డి మంగళవారం మెరిట్ స్కాలర్ షిప్ ను అందజేశారు.
శ్వేత ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించింది.. మెరిట్ స్కాలర్ షిప్ కింద 5 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో విభాగం సిబ్బంది రాము, రాంమ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.