కాజల్ తో ‘మాంగళ్య’ షోరూం ప్రారంభోత్సవం

mangalya

-కరీంనగర్ లో భారీ జనంతో కిక్కిరిసిన మాంగళ్య   షోరూం
కరీంనగర్ : కరీంనగర్ లో ‘మాంగళ్య’ ఫ్యామిలీ షాపింగ్ మాల్  ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ రోడ్ లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన భవనంలో అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

kajal

కాగా మంగళ్య ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. షోరూం యజమాని ఓం నమశ్శివాయ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒక చార్టెడ్ ఫ్లైట్ ద్వారా కరీంనగర్ మొత్తం వారం రోజులుగా కరపత్రాలు పంచారు. కరీంనగర్ లోని ప్రతీ రోడ్డు గల్లీలో మాంగళ్య షోరూం ప్రారంభోత్సవ ఫ్లెక్సీలు పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి కాజల్ ను కార్యక్రమానికి తీసుకొచ్చారు. బ్యాండ్ మేళాలు, జీపులు, ఆటోలతో కరీంనగర్ మొత్తం మాంగళ్య సందడే కనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరగడానికి యాజమాన్యం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ లో ముందెన్నడూ లేనంత గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేసేసరికి నగరవాసులు ముక్కున వేలేసుకున్నారు. ఇంతకుముందు మాంగళ్య షోరూం అధినేత ఓం నమశ్శివాయ వరంగల్ లో కూడా షోరూం ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *