
హైదరాబాద్, ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన వెంట డిప్యూటీ సీఎంలు రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు హరీష్, తుమ్మల, తలసాని, ఈటెల, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాకా కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కూడా వెంకటస్వామి పార్థీవ దేహానికి నివాళులర్పించారు. వెంకటస్వామి గొప్ప నేత అని కొనియాడారు.