
కరీంనగర్ : మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు కరీంనగర్ జిల్లాలోని ప్రధాన కాకతీయ కెనాల్ ను పరిశీలించారు. కాలువ లైనింప్ పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం గుండా పోతున్న కేనాల్ పై కరకట్టలను, మధ్యలో బ్రిడ్జిలను పరిశీలించారు.
నిధులు మంజురై పనులు జరుగుతున్న క్రమంలో మంత్రులు పనులు పరిశీలించి నాణ్యంగా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నీటిపారుదల శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.