
కృష్ణ, ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాలడుగు వెంకట్రావ్ (75) మృతిచెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన స్వస్థలం కృష్ణ జిల్లా ముసునూరు గోగులంపాడు గ్రామం.
పాలడుగు వెంకట్రావ్ రాజకీయ ప్రస్థానం..
– 1968లో యువజన కాంగ్రెస్ లో చేరారు.
– 1972 ఎమ్మెల్సీ తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నిక
-1978 89లో ఎమ్మెల్యే నూజీవీడు నియోజకవర్గం నుంచి ఎన్నిక
-అంజయ్య, నేదురుమల్లి కేబినెట్ లో కేబినెట్ మంత్రిగా పనిచేశఆరు.
– 2007లో శాసన మండలి కి ఎన్నిక
-2009లో కూడా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ఇప్పటికీ కొనసాగుతున్నారు.
భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన ఎమ్మెల్యేగా పాలడుగు వెంకట్రావ్ ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన మృతికి పీసీసీ చీఫ్ లు పొన్నాల, రఘవీరాలు సంతాపం తెలిపారు.