
హైదరాబాద్ : తెలంగాణ సభలో బూతు పర్వం మంగళవారం కొనసాగింది. సాక్షాత్తు మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి ‘నీయవ్వ’ అంటూ సంభోదించడం వివాదానికి దారీతీసింది.
సభలో అధికార పార్టీ సభ్యులు కూడా జాతీయ గీతాన్ని అవమానపరిచారని.. వారిపైనా చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అరుపులతో నీయవ్వ అంటూ పరుషంగా మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలతో కంగుతిన్న కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.