కాంగ్రెస్ రైతు పక్షపాతి.. బీజేపీ ధోఖాపార్టీ

00000rrhaul

ఆదిలాబాద్ : రైతుల భూములను లాక్కునే విధంగా చట్టాలు చేస్తున్న బీజేపీ ధోఖా పార్టీ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మండిపడ్డారు.  ఆదిలాబాద్ వడ్యాల్ బహిరంగ సభలో పాదయాత్ర ముగించుకున్న తర్వాత మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులుకు మేలు చేసేలా భూసేకరణ చట్టం తెస్తే.. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు, కోటీశ్వరులకు మేలు చేసేలా భూసేకరణ చట్టం తెస్తుందన్నారు. దీనివల్ల రైతుల భూములను లాక్కొని బడా వ్యాపారవేత్తలకు బీజేపీ కట్టబెడుతుందని ధ్వజమెత్తారు.

బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల భూమి దొరకడం లేదని.. రేట్లు విపరీతంగా పెరిగాయని.. పట్టణాల్లో ధరలు విపరీతం గా పెరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 70 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీ దే అన్నారు. రైతుల మేలు , బాగు కోసం పాటుపడేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *