
ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ దూసుకుపోతోంది.. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై నిలదీస్తోంది.. ఈ మధ్య కాంగ్రెస్ నాయకులందరూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడ అడ్డుకుంటున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి ఇరగదీస్తున్నారు. రాహుల్ గాంధీని 5 నెలల కోసారి వచ్చేలా పర్యటన ఖరారు చేసుకొని వచ్చే 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందు కెళ్తోంది..
కాగా టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నే టార్గెట్ చేసింది. తమకు తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది.. టీడీపీ నాయకులను ఆకర్శించి ఆ పార్టీ ఉనికినే లేకుండా చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తన దృష్టి అంతా కాంగ్రెస్ వైపు నిలిపింది.. తెలంగాణలో నాయకుడు లేని నావ కాంగ్రెస్ అని దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ దెబ్బకొడతామని టీఆర్ఎస్ భావిస్తోంది.. మొత్తానికి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ లదే..