కాంగ్రెస్ మేడిపండు గుట్టు విప్పిన పెద్దమనిషి

13-1447404201-kcr-satyanarayan-765

ఎమ్మెస్సార్.. ఎం. సత్యనారాయణ రావు.. వైఎస్ కంటే ముందే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీని ఏలిన నేత.. అంతటి కరీంనగర్ నేత వల్లే కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని బతికించాడు.. ఎమ్మెస్సార్ కేసీఆర్ కు బలం లేదని విమర్శిస్తే పోటీ చేసి గెలిచాడు. వైఎస్ ఉన్పప్పుడు కూడా ఎమ్మెస్సార్ ఓ వెలుగు వెలిగాడు.. పాపం ఇప్పుడు వృద్ధాప్యంతో మంచం పట్టాడు.. ఇక్కడకు కట్ చేస్తే..

వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం పెద్దమనిషి అని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెస్సార్ ను పిలిచారు. ఆయన 70 ఏళ్ల రాజకీయ జీవితం.. ఇందిర నుంచి నేటి మోడీ వరకు ఎందర్నో చూసిన నేత ఊరికే మాట అంటాడా.. ఆయన అన్నదే ఇప్పుడు వాస్తవం కాబోతోంది..

తెలంగాణ ను కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నడని.. టీఆర్ఎస్ పథకాలు అద్భుతం అని ఎమ్మెస్సార్ వ్యాఖ్యానించారు. వరంగల్ ఎన్నికలున్నయ్ కాబట్టి టీఆర్ఎస్ ను తిట్టాలే తప్పితే వారి మంచి పాలన ముందు కాంగ్రెస్ గెలవదని తేల్చేశాడు ఎమ్మెస్సార్..

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు దుమారం రేపాయి.. టీఆర్ఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యలు అస్త్రంలా దొరకగా.. కాంగ్రెసోళ్లకు మాత్రం పెద్దాయన మాటలు రుచించడం లేదు.. అదీ సంగతీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *