Breaking News

కాంగ్రెస్ ముక్త్ ఢిల్లీ …

images

ఢిల్లీలో కాంగ్రెస్ స్కోరు సున్నాం. 70 సీట్లలో ఒక్కటీ దక్కించుకోకుండా రికార్డు నెలకొల్పింది. కనీసం ఒక్క నియోజకవర్గంలోనూ ప్రజలు చేయికి చేయూత  నివ్వలేదు. పోనీలే పాపం రాష్ట్రపతి కూతురు కదా అని శర్మిష్టను కూడా గెలిపించలేదు. సోనియా ప్రచారం, రాహుల్ రోడ్ షోలు పనిచేయలేదు.

లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన నినాదం కాంగ్రెస్ ముక్త్ భారత్. ఆ దిశగా డిల్లీ తొలి అడుగు అని ఓ నాయకుడు కామెంట్ చేశాడు. ఆయన ఎవరో కాదు, నిన్నటి దాకా కాంగ్రెస్ పంచన చేరి పదవులు ఎంజాయ్ చేసిన శరద్ పవార్. ఇక ఈ ఏడాది అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడా కాంగ్రెస్ నామమాత్రమే. జేడీయూ, ఆర్జేడీ మిత్ర పక్షంగా, తోక పార్టీగా కనీసం రెండు మూడు సీట్లయినా గెలవాలనేది కాంగ్రెస్ తాపత్రయం.

ఆ ప్రయత్నం కూడా విఫలమైతే కాంగ్రెస్ జీరో గా మారిన రాష్ట్రాల్లో మరోటి చేరుతుంది. మొత్తానికి ఢిల్లీ మాత్రం కాంగ్రెస్ ముక్త్ అయినట్టేనా?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *