Breaking News

కాంగ్రెస్ మార్చ్ మొదలైంది..

congress-march

-సచివాలయ తరలింపుకు నిరసనగా కాంగ్రెస్ పాదయాత్ర
-తరలివచ్చిన అందరు కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్, ప్రతినిధి : ప్రస్తుత సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిస్తున్నందుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భారీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించే ఈ పాదయాత్రకు పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య సారథ్యం వహిస్తున్నారు. పాదయాత్ర రాజ్ భవన్ కు చేరిన అనంతరం గవర్నర్ కు దీనిపై వినతిపత్రం అందజేయనున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని.. ప్రజలు పించన్లు అందక, రేషన్ లభించక అవస్థలు పడుతుంటే అవేమి పట్టించుకోకుండా కేసీఆర్ ప్రజాధనం వృథా చేస్తూ 6 అంతస్తుల కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనుకుంటున్నారని.. దీన్ని మానుకోకపోతే మరింత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఈ పాదయాత్రలో పొన్నాల తో పాటు కాంగ్రెస్ నాయకులు దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ , గీతారెడ్డితో పాటు దాదాపు అందరు సీనియర్ నాయకులు పాల్గొన్నరు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *