
– అభివృద్ధి ఆగిపోతుంది..
– ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
అధికార దాహంతో నోటికొచ్చిన వాగ్ధానాలు ఇస్తున్న కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్, నర్సింగపూర్, కొండపాక గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధతతో పని చేశఆనని, గడ్డి పొసను కూడా గౌరవించానని అన్నారు.17 ఏళ్లలో ఎర్ర చీమకు కూడా అన్యాయం చెయ్యలేదన్నారు. కాంగ్రెస్ దొంగ ముఖాలకు ఏరోజైనా ఆడబిడ్డ కట్నం ఇచ్చారా. కాంగ్రెస్ దొంగ ముఖాలకు ఏరోజైనా పింఛన్ ఇచ్చారా. కాంగ్రెస్ దొంగ ముఖాలకు రైతులకు లక్ష రూపాయలు మాఫీ చేశారా. అని మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాజకీయలకతీతంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు లబ్ధిపొందారన్నారు. ఎన్నికల వరకే పార్టీ ప్రచారం చేస్తామని, అనంతరం నియోజకవర్గ అభివృద్ధే ప్రధానమని అన్నారు. సీసీరోడ్లు, చెక్ డ్యాములు కట్టిస్తామని ప్రజల్లోకి రాలేదని, ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బందీగా, బాధల్లో ఉన్నారని ఉద్యమంలోకి వచ్చానని గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బంగారు తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్నామని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.