Breaking News

కాంగ్రెస్ పీఛేముడ్

04KRDC10

కరీంనగర్ : గడిచిన కాలంలో పదేళ్ల పాటు సమైక్య ఏపీలో పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దెబ్బకు కుదేలవుతోంది.. కనీసం పోటీ చేయడానికి కూడా భయపడుతోంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగకపోవడమే ఇప్పుడు ప్రతిపక్షం పాత్రపై సందేహాలకు తావిస్తోంది..

కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేస్తుందని తొలుత ప్రకటించారు. దిగ్గజాలైన కాంగ్రెస్ నేతలున్నా కరీంనగర్ లో పోటీకి చాలా మంది ఆసక్తి చూపారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ , డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది బరిలో ఉండటానికి ఆసక్తి చూపారు.. కానీ చివరకు బలం లేదంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పి కరీంనగర్ లో పోటీ నుంచి తప్పుకుంది.. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎన్నికల ముందే ఎదురైనట్టైంది.

కాగా కరీంనగర్ లో రెండు స్థానిక సంస్థల స్థానాలున్నాయి..జిల్లాలో 1205 మంది ఓటర్లున్నారు. టీఆర్ఎస్ కు 520మంది, కాంగ్రెస్ కు వలసలు పోగా 350 మందికి పైగా ఉన్నారు. టీడీపీకి 48, బీజేపీ 76మంది ఉన్నారు. కాంగ్రెస్ పోటీ చేస్తే టీడీపీ, బీజేపీల మద్దతు, కొందరు అసంతృప్త టీఆర్ఎస్ నాయకులు ఓట్లు వేసే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పోటీకి దిగకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

పోటీ ఏర్పడితే క్యాంపు రాజకీయాలు జరిగి స్థానిక ఓటర్లు విహార యాత్రలకు వెళ్లేవారు. వారికి అడిగినంత డిమాండ్ ఉండేది. కానీ కాంగ్రెస్ తప్పుకోవడంతో క్యాంపు రాజకీయాలు లేకుండాపోయాయి. దీంతో స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *