
హైదరాబాద్ , ప్రతినిధి : మాదాపూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్లో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి మధ్య ఘర్షణ జరిగింది. ఇరువురు నేతలు ఆవేశంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇద్దరూ మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల విషయంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది.