Breaking News

కాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకిన దిగ్విజయ్

Digvijay  singh44_0_0_0

హైదరాబాద్, ప్రతినిధి : ఆంధ్రాలో అధికారం పోయింది. ఇక ఎప్పటికీ అక్కడ అధికారం వస్తుందని ఆశ లేదు.. తెలంగాణ ఇస్తే ఇక్కడ అధికారం వస్తుందన్నారు. కానీ రోజుకో నేత వలస పోతూ పార్టీని నామరూపల్లేకుండా చేస్తున్నారు. నేతల విభేదాలు పార్టీ కొంపముంచుతున్నాయంటూ దిగ్విజయ్ పార్టీ సీనియర్ నేతలపై మండిపడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్ ను చక్కదిద్దేందుకు .. పార్టీని పటిష్టపరిచేందుకు దిగ్విజయ్  మంగళవారం హైదరాబాద్ వచ్చారు. వచ్చీ రావడంతో పార్టీ ఫిరాంయిపులపై మండిపడ్డారు. పార్టీ మారిన వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

పార్టీని పటిష్ట పరిచేందుకు నేతలంతా విభేదాలు మాని కలిసి కట్టుగా ముందుకు సాగాలని.. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు జిల్లాల పర్యటన చేయాలని సూచించారు. డిగ్గీరాజా క్లాస్ తోనైనా నేతలు మారుతారో లేదో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *