Breaking News

కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎమ్మెల్సీ బరిలో కోమటిరెడ్డి

CONGRESS RAJGOPAL REDDY2

నల్గొండ : స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నల్గొండ నుంచి కాంగ్రెస్ పోటీకి సై అన్నది.. దాదాపు సగం మంది ఓటర్లు ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలలో టీడీపీ కాంగ్రెస్ లకు కాస్త బలం ఉంది.. దీంతో నల్గొండ నుంచి పోటీకి కాంగ్రెస్ సై అన్నది..

ఇవాళ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అధిష్టానం మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమావేశమైన కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిని నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది..

అభ్యర్థిగా ఎంపికైన తర్వాత కోమటిరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అందరిని భయపెడుతూ పనులు కాకుండా అడ్డుకుంటూ అనైతికంగా పార్టీలో చేర్చుకుంటోందని..వారి ఆగడాలను అరికట్టడానికే కాంగ్రెస్ తరఫున నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. సోనియా, దిగ్విజయ్ సింగ్ ల సూచనమేరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *